వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాన మంత్రి గే వివాహం చేసుకున్నాడు

|
Google Oneindia TeluguNews

లక్సెంబర్గ్: అతను ఒక దేశ ప్రధాన మంత్రి. ఆయన తీసుకునే నిర్ణయాలు ఆదేశ ప్రజల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వ్యక్తి అతని ప్రాణ స్నేహితుడిని స్వలింగ (గే) వివాహం చేసుకున్నాడు. దేశ ప్రజలకు ఆయన తన స్నేహితుడిని బహిరంగంగా పరిచయం చేశాడు.

లక్సెంబర్గ్ దేశ ప్రధాన మంత్రి జేవియర్ బిటెల్ (42) శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తరువాత తన సహచరుడు, అర్కిటెక్ట్ అయిన గౌతియర్ డెస్టెనే ను లక్సెంబర్గ్ నగరంలోని టౌన్ హాల్ లో సంప్రదాయబద్దంగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ లో స్వలింగ వివాహం చేసుకున్న తొలి ప్రధానిగా బిటెల్ రికార్డు సృష్టించారు. ఈ వివాహ వేడుకకు అనేక దేశాలకు చెందిన ప్రముఖులు హాజరైనారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మైకెల్ తో సహ 500 మంది అతిథులు ఈ పెళ్లికి సాక్షులు అయ్యారు.

Luxembourg's Prime Minister Xavier Bettel gay marriage.

2010లో ఐస్ లాండ్ ప్రధాని జోహనా సిగుర్డార్డోటిర్ తన స్నేహితురాలిని వివాహం చేసుకుంది. ప్రపంచంలో మొదటి సారి గే వివాహం చేసుకున్న ప్రధానిగా ఆమె చరిత్రకెక్కారు. తరువాత బిటెల్ రెండవ గే వివాహం చేసుకున్నారు.

2013 డిసెంబర్ నెలలో జేవియర్ బిటెల్ లక్సెంబర్గ్ ప్రధాని అయ్యారు. అంతకు ముందు గత కొన్ని సంవత్సరాల నుండి బిటెల్ తన స్నేహితుడితో సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడు దేశ విదేశాలలోని ప్రముఖల సమక్షంలో అందరూ చూస్తుండగా స్నేహితుడిని వివాహం చేసుకున్నారు.

English summary
Xavier Bettel (42) and his partner, Gauthier Destenay, an architect from Belgium, are among the first gay men to wed in the mostly Catholic Grand Duchy since it became the latest EU state to extend full rights to same-sex couples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X