రోడ్డెక్కిన 20 నిమిషాలకే ముక్కలు ముక్కలైన రూ. కోటీ 69 లక్షల విలువైన లాంబోర్గిని కారు

అప్పుడే కొన్న ఖరీదైన లాంబోర్గిని కారు. రోడ్డెక్కి 20 నిమిషాలు కూడా కాలేదు. హైవే పక్కన ఆపడం, ఆ వెనకే వస్తున్న వ్యాన్ గట్టిగా ఢీకొట్టడంతో ఆ లగ్జరీ కారు తీవ్రంగా దెబ్బతింది. బ్రిటన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లోని ఎం-1 హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
ఈ కారు ఖరీదు సుమారు 2 లక్షల డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే రూ. కోటీ 69 లక్షలకు పైమాటే. రోడ్డు మీదకు వచ్చిన కొద్ది నిమిషాలకే ఈకారులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి దాన్ని హైవే పక్కన నిలిపారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ వ్యాను కారును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ తలకు దెబ్బ తగిలినా, అవి అంత తీవ్రమైందికాదని వెస్ట్ యార్క్ షైర్ పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను యార్క్ షైర్ పోలీసు అధికారి ఒకరు ట్వీట్ చేశారు. యాక్సిడెంట్ మామూలు విషయమే అయినప్పటికీ కారును తలచుకుని బాధపడాల్సిందేనని కామెంట్ పెట్టారు.
https://twitter.com/WYP_RPU/status/1275860418058235904
ప్రమాదం కారణంగా ఎం-1 హైవేలోని కొంత భాగాన్ని కాసేపు క్లోజ్ చేయాల్సి వచ్చింది.

అయితే ఈ కారు ఓనర్ ఎవరు, దాన్ని ఎక్కడ కొన్నారు, అది కొత్తదా, సెకండ్ హ్యాండ్దా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఈ మోడల్ కార్లను 150,000 యూరోల నుంచి 250,000 వరకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం
- ఈ 'డ్రాకులా' రక్తం తాగడు... శత్రువులను ఈటెలకు గుచ్చి కాకులు, గద్దలకు వదిలేసేవాడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే 2,500 కోట్ల కుబేరుడయ్యాడు
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- మెటల్ డిటెక్టర్‌తో గుప్తనిధి వేట.. రూ.48 లక్షల విలువైన 1.4 కేజీల బంగారం లభ్యం
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- హ్యారీ పోటర్ హౌజ్ ఫర్ సేల్
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications