పాగ‌ల్ జోడీ నంబ‌ర్ వ‌న్..! వీళ్లిద్ద‌రికి ఛాద‌స్తం ముదిరింది..!!

హైద‌రాబాద్ : కొంద‌రి స‌ర‌దాను చూస్తే వీళ్ల స‌ర‌దాని త‌గ‌లెట్ట అని తిట్టాల‌నిపిస్తుంది. వారు చేసే ప‌నుల వెన‌క ఉన్న సిల్లీ నెస్ చూసి మ‌రింత మండిపోతుంది జ‌నాల‌కు. పోర్చ్​గీస్ లో ఓ యువ‌జంట చేపిన ప‌నికి నెటిజ‌న్లు అగ్గిమీద గుగ్దిలం అయ్యారు. కొందరికి ఫీట్లు చేయడమంటే సరదా. ఫీట్లు చేస్తూ ఫొటోలు దిగడమంటే మహా మహా సరదా. వాటిని ట్విట్టర్లోనో , ఫేస్ బుక్ లోనో, ఇన్ స్టాగ్రామ్​లోనో పెట్టేసి లైకులు, కామెంట్ల కోసం ఎదురుచూసేంత సరదా. కానీ, ఆ సరదా ఒక్కోసారి రివర్స్ అయిపోవచ్చు. లైకులకు బదులు తిట్లు వస్తుండొచ్చు. రాక్వెల్, మిగ్వెల్ అనే ఇద్దరు పోర్చ్​గీస్ జంట కదులుతున్న రైల్లో నుండి స్టంట్ చేశారు. రాక్వెల్ .. రైలు హ్యాండిల్ ను పట్టుకుని ప్రమాదకరంగా బయటకు వేలాడుతుంటే, మిగ్వెల్ బయటకు ఒరుగుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతడి కాళ్లు అంతో ఇంతో రైలు లోపలే ఉన్నా రాక్వెల్ మాత్రం దాదాపు బయటకొచ్చేసింది.

ఆ ఫొటోను ఇన్ స్టాగ్రాంలో వారే స్వయంగా పోస్టు చేయగా, నెటిజన్లు లైకులకు బదులు తిట్ల వర్షం కురిపించారు. పిచ్చి పట్టిందా అంటూ విమర్శించా రు. కాలో, చెయ్యో జారి లోయలో పడితే ఏమైనా ఉందా అంటూ ఆందోళన వ్య‌క్తం చేసారు. ఒక్క ఫొటో కోసం ఇంత డేంజర్ స్టంట్ చేస్తారా అని ప్రశ్నించారు. ''ఇద్దరు పిచ్చోళ్లు కొన్ని లైకుల కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు" అంటూ మండిపడ్డారు.

 Mad pair..! Danger skits in moving train..!!

ఓ అమ్మాయి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే బదులు.. నువ్వే బయటకు వేలాడొచ్చుగా అంటూ మిగ్వెల్‌‌పై అసహనం వ్యక్తం చేశారు. వాళ్లు మాత్రం తమ స్టంట్‌‌ను సమర్థిం చుకున్నారు. తామేం రిస్క్​ చేయలేదని, ట్రైన్ స్లోగా వెళుతోందని వివరణ ఇచ్చింది రాక్వెల్. అసలు తాము ఇంతకు ముందు చేసిన వాటితో పోలిస్తే ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని ఆమె చెప్పడం విశేషం..!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+