షాక్: యువతి బట్టలూడదీసిన మడోన్నా(వీడియో)
మెల్బోర్న్: ఇంటర్నేషనల్ పాప్ సింగర్ మడోన్నా ప్రవర్తన అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించిన ఓ కాన్సర్ట్‌కి మడోన్నా హాజరైంది. స్టేజి పైకెక్కిన మడోన్నా ఓ పాట పాడుతూ వేలాది అభిమానుల ముందు తన పక్కనే నిలబడిన ఓ యువతి దుస్తులను సగం వరకు తొలగించేసింది.
దీంతో యువతితో సహా ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. మడోన్నా ప్రవర్త తీరుకి మీడియాతో సహా అందరూ ఆమెపై మండిపడ్డారు. తన భర్త, కొడుకు తన నుంచి దూరం కావడంతో మడోన్నా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతోందని స్థానిక మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, తన అభిమాన తార తన బట్టలూడదీయడంపై స్పందించిన ఆ యువతి ఈ ఘటనకు బాధపడటం లేదని చెప్పడం గమనార్హం. అంతేగాక, తన జీవితంలో ఇది మర్చిపోలేని ఘటన అని చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications