వీడియో: ట్రంప్ ఆట పాట చూస్తారేటి?

Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ సందర్భంగా కేపిటల్ వన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) విజయోత్సవ సభలో ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇందులో పాల్గొన్నారు.

MAGA victory rally Donald Trump grooved during a musical performance

కొత్తగా ఏర్పడబోయే తన ప్రభుత్వ హయాంలో అమెరికాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి చేపట్టదలిచిన ప్రణాళికల గురించి వివరించారాయన. అంతర్జాతీయ అంశాల గురించీ మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం గురించి ప్రస్తావించారు. మధ్య- తూర్పు దేశాల్లో 16 నెలలుగా చెలరేగుతున్న ఉద్రిక్తతలపైనా మాట్లాడారు ట్రంప్.

డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం ముగిసిన తరువాత మ్యూజికల్ నైట్ ఏర్పాటైంది. దాదాపుగా అయిదు దశాబ్దాలుగా అమెరికన్లను ఉర్రూతలూగిస్తూ వస్తోన్న YMCA పాటను పెర్‌ఫార్మ్ చేశారు. 6.47 నిమిషాల పాటు సాగిందీ డాన్స్ పెర్‌ఫార్మెన్స్. ఇందులో ఆర్టిస్టులతో కలిసిపోయారు ట్రంప్. వారితో కలిసి గళం కలిపారు. వైఎంసీఏ పాటకు స్టెప్పులేశారు.

1978 అక్టోబర్ అక్టోబర్ 17వ తేదీన విడుదలైందీ వైఎంసీఏ ఆల్బమ్. జాక్వెస్ మొరాలి ఈ పాటను రాశారు. విలేజ్ పీపుల్ అనే డిస్కో ట్రూప్ దీన్ని తొలిసారిగా ప్రదర్శించింది. డిస్కో రిథమ్‌లో సాగే పాట ఇది. న్యూయార్క్‌లోని కాసాబ్లాంకా రికార్డ్స్, సిగ్మా సౌండ్స్ సంస్థ దీన్ని రికార్డు చేశాయి.

అమెరికన్లను ఉర్రూతలూగించిందీ పాట. దాదాపుగా 15 దేశాల్లో సింగిల్ మ్యూజిక్ ఛార్ట్‌లో చాలాకాలం పాటు అగ్రస్థానంలో కొనసాగింది. 20వ శతాబ్దంలో 100 అత్యత్తమ పాటల్లో దీనికి చోటు లభించిందంటే అది ఎంతగా జనంలోకి చొచ్చుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+