మూడో ప్రపంచ యుద్ధానికి చాలా దగ్గరగా ఉన్నాం

Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ సందర్భంగా కేపిటల్ వన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) విజయోత్సవ సభలో ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇందులో పాల్గొన్నారు.

MAGA victory rally I will end the war in Ukraine and stop the chaos in the Middle East says Trump

కొత్తగా ఏర్పడబోయే తన ప్రభుత్వ హయాంలో అమెరికాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి చేపట్టదలిచిన ప్రణాళికల గురించి వివరించారాయన. అంతర్జాతీయ అంశాల గురించీ మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం గురించి ప్రస్తావించారు. మధ్య- తూర్పు దేశాల్లో 16 నెలలుగా చెలరేగుతున్న ఉద్రిక్తతలపైనా మాట్లాడారు ట్రంప్.

ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడానికి ప్రణాళికలను రూపొందిస్తానని, ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే మధ్య- తూర్పు దేశాలు, పశ్చిమ ఆసియా దేశాల్లో చెలరేగుతున్న ఉద్రిక్తతలను శాంతింపజేస్తాననీ చెప్పారు.

ఇజ్రాయెల్- గాజా, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య సుమారు 16 నెలలుగా కొనసాగుతూ వస్తోన్న దాడులు, ప్రతిదాడులను పరోక్షంగా ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. తక్షణమే ఈ ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటానని చెప్పారు. మూడో ప్రపంచ యద్ధానికి ఎంత దగ్గరగా ఉన్నామో మీకు తెలియదు.. అంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+