ఏం ఛాన్స్ కొట్టావ్ మస్క్..

Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెస్ట్ ఫ్రంట్‌కు బదులుగా కేపిటల్ వన్ ఎరినాలోకి మారిందీ కార్యక్రమం.

MAGA victory rally Trump announced New department of efficiency headed by Elon Musk

తాజాగా కేపిటల్ వన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) విజయోత్సవ సభలో ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇందులో పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పడబోయే తన ప్రభుత్వ హయాంలో అమెరికాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి చేపట్టదలిచిన ప్రణాళికల గురించి వివరించారాయన. అంతర్జాతీయ అంశాల గురించీ మాట్లాడారు. పాఠశాల దశ నుంచే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదాన్ని వినిపించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్‌కు భారీ కానుకను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన కోసం కొత్తగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE)ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి ఎలాన్ మస్క్‌ సారథ్యాన్ని వహిస్తారని ప్రకటించారు.

వీఐపీ గ్యాలరీ బాక్స్‌లో కూర్చుని ఉన్న ఎలాన్ మస్క్‌ను వేదిక మీదికి ఆహ్వానించారు ట్రంప్. కమ్ ఎలాన్.. అంటూ పిలిచారు. వేదిక వద్ద తన పక్కనే నిలబెట్టుకున్నారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి మస్క్‌ను చీఫ్‌గా చేస్తానని అన్నారు.

ఈ సందర్భంగా మస్క్ మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులను చూస్తారని హామీ ఇచ్చారు. అమెరికన్ల జైత్రయాత్ర ఇక్కడి నుంచే ఆరంభమైందని అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇస్తామని పేర్కొన్నారు. శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+