Barbie అని గూగుల్‌లో టైప్ చేయండి- మేజిక్ ఆవిష్కృతం
న్యూఢిల్లీ: హాలీవుడ్‌లో బిగ్ డే. రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటి- క్రిస్టొఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్. భారీ బడ్జెట్ మూవీ ఇది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. దానికి తగ్గట్టే కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తొలి రోజే భారత్‌లో 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకుంది.
వీకెండ్ ముగిసే సరికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒప్పెన్ హైమర్ సినిమాను సుమారు 100 మిలియన్ డాలర్లతో నిర్మించారు. మన కరెన్సీతో పోల్చుకుంటే దీని నిర్మాణ వ్యయం సుమారుగా 820 కోట్ల రూపాయలు. భారత్‌లో 1,200 స్క్రీన్లల్లో విడుదలైందీ మూవీ. తొలి రోజే 2,900 షోలు ప్రదర్శించారు.

అమెరికన్ న్యూక్లియర్ బాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా క్రిస్టొఫర్ నోలన్ ఓపెన్‌హైమర్ సినిమాను తీశారు. మన్ హట్టన్ మిషన్ నేపథ్యంలో సాగుతుందీ సైన్స్ ఫిక్షన్ మూవీ. టైటిల్ రోల్‌ను సిలియన్ మర్ఫీ పోషించారు. ఫ్లోరెన్స్, రాబర్ట్ డౌనీ, ఎమిలీ బ్లంట్, మ్యాట్ డామన్, జాక్ క్వైడ్.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
రెండో సినిమా- బార్బీ. మార్గోట్ రాబీ టైటిల్ క్యారెక్టర్‌లో మెరిశారు. ర్యాన్ గోస్లింగ్, దువా లిపా, సిము లియు, అరియానా గ్రీన్‌బ్లాట్, మైఖేల్ సెరా, ఎమ్మా మాకీ తదితరులు నటించారిందులో. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించారు. బార్బీగా నటించిన మార్గోట్ రాబీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సిినిమా మొత్తాన్నీ ముందుండి నడిపించారు. తొలి రోజే 50 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టుకుంది ఈ సినిమా.

ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో హాలీవుడ్‌లో సందడి నెలకొంది. బార్బీ సినిమా అభిమానులకు గూగుల్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్‌లో Barbie అని టైప్ చేస్తే.. స్క్రీన్ మొత్తం కంప్లీట్‌గా మారిపోతుంది. పింక్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. అదే సమయంలో స్క్రీన్ మీద గులాబీ రంగులో స్టార్స్ మెరుసిపోతూ కనిపిస్తాయి.

డెస్క్ టాప్, ల్యాప్ టాప్, మొబైల్ వర్షన్లలోనూ దీన్ని చూడొచ్చు. అలాగే- బార్బీ సినిమాలో మెరుపులు మెరిపించిన ఆస్ట్రేలియన్ నటి Margot Robbie పేరును గూగుల్‌లో టైప్ చేసినా కూడా ఇదే ఈ మేజిక్ ఆవిష్కృతమౌతుంది. బార్బీ సినిమా విడుదలను దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చింది గూగుల్.












Click it and Unblock the Notifications