రష్యాలో భారీ భూకంపం! తీవ్రత 7.8, సునామీ భయం లేదన్న అమెరికా!
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రాత్రి 11.34 గంటల ప్రాంతంలో కంచట్కా ద్వీపకల్పంలోని కమాండర్ దీవుల్లో భూమి తీవ్ర స్థాయిలో కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. సునామీ రావచ్చని త
మాస్కో: రష్యాలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.34 గంటల ప్రాంతంలో రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలోని బేరింగ్ ఐలాండ్ సముద్ర తీరంలో భూమి తీవ్ర స్థాయిలో కంపించింది.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. బేరింగ్ దీవుల్లోని నికోల్ కోయ్ నగరానికి 233 కిలోమీటర్ల దూరంలో 483 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది.
ఈ భారీ భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. మరోవైపు భూకంపం తీవ్రతను బట్టి సునామీ కూడా సంభవించే ప్రమాదం ఉన్నట్లు జియోఫిజికల్ సర్వే ఆఫ్ రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (జీఎస్ ఆర్ఎఎస్) తొలుత హెచ్చరించింది.

అయితే ఆ తరువాత సునామీ వచ్చే అవకాశాలు లేవని, భయపడాల్సిన అవసరం లేదని యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ సునామీ సెంటర్, యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థలు సంయుక్తంగా తెలిపాయి.
బేరింగ్ దీవుల్లో గత రెండు రోజుల్లో రెండుసార్లు భూకంపం సంభవించింది. సోమవారం కూడా ఇక్కడ 6.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ప్రభావం న్యూజిలాండ్ పై ఏమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
మరోవైపు దక్షిణ అమెరికాలోని పెరూలో కూడా సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. పెరులోని పుకియో పట్టణానికి ఆగ్నేయంగా 104 కిలోమీటర్ల దూరంలో 44 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications