వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

internet outage : పలుదేశాల్లో నిలిచిన ఇంటర్నెట్‌-బ్యాంకులు, ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇవాళ ఇంటర్నెట్‌ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు దేశాల్లో ఇంటర్నెట్‌ పనిచేయకపోవడంతో బ్యాంకులు, ఎయిర్‌లైన్స్‌తో పాటు ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించే పలు సంస్ధలు ఇబ్బందులు పడ్డాయి. అలాగే వినియోగదారులపైనా తీవ్ర ప్రభావం పడింది. అయితే కొద్ది గంటల్లోనే పలు చోట్ల సమస్యలు పరిష్కరించారు.

ఆస్ట్రేలియా, హాంకాంగ్‌తో పాటు పలు దేశాల్లో ఇవాళ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కొన్నిగంటల పాటు ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఆర్ధిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. పలు చోట్ల సర్వర్లు పనిచేయలేదు. దీంతో పోస్టల్‌, టికెట్ల బుకింగ్ వంటి సేవలు వినియోగించుకునే కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ కూడా పనిచేయకపోవడంతో ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. 17 నిమిషాల పాటు ఇంటర్నెట్‌ పనిచేయలేదని, తమ టీమ్‌ తీవ్రంగా శ్రమించి తిరిగి దాన్ని పునరుద్ధరించినట్లు హాంకాంగ్ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ ట్వీట్ చేసింది.

major banks and airlines affected with global internet outage today

అటు ఆస్ట్రేలియాలో సైతం ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో కీలకమైన ఆర్ధిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. తొలుత ఏం జరిగిందో తెలియలేదు. నిపుణులు రంగంలోకి దిగి ఏం జరిగిందో ఆరా తీశారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇంటర్నెట్‌ సేవలపై ప్రభావం పడినట్లు వారు తేల్చారు. ఆస్ట్రేలియా పోస్టల్‌ సర్వీస్ కూడా తమ సేవలపై ఇంటర్నెట్‌ నిలిచిపోవడం తీవ్ర ప్రభావం చూపిందని ప్రకటించింది. అమెరికాలో ఎయిర్‌లైన్‌ సంస్ధల్లోనూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయంగా ఇంటర్నెట్‌ను నియంత్రించే వ్యవస్ధల్లో తలెత్తిన లోపం కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

English summary
A wave of brief internet outages hit the websites of banks, airlines and financial institutions across the globe on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X