చైనా ఏజెన్సీ ఘోర తప్పిదం: వాజపేయికి బదులు జార్జ్ ఫెర్నాండేజ్ ఫొటో, నెటిజన్ల తీవ్ర విమర్శలు
Recommended Video

టుడే స్పెషల్ స్టొరీ : వాజపేయికి బదులు జార్జ్ ఫెర్నాండేజ్ ఫొటో
న్యూఢిల్లీ/బీజింగ్: చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఘోర తప్పిదం చేసింది. భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజపేయిని గుర్తించడంలో విఫలం కావడం గమనార్హం.
భారతరత్న వాజపేయి మృతి విషయాన్ని ట్వీట్ చేస్తూ ఆయన ఫొటోకు బదులుగా జార్జ్ ఫెర్నాండెజ్ ఫొటోను పోస్ట్ చేసింది. వాజ్‌పేయి కేబినెట్‌లో ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా పనిచేశారు.

వాజపేయి ఫొటో బదులు ఫెర్నాండెజ్ ఫొటో కనిపించడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. చీప్ జర్నలిజానికి ఇది నిదర్శనమని దుమ్మెత్తిపోశారు. కనీసం ఫొటో అయినా మార్చాలని కోరారు.
నెటిజన్ల విమర్శలతో అప్రమత్తమైన జిన్హువా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి తప్పును సరిదిద్దుకుంది. ఫొటోను సరిదిద్దిన తర్వాత కూడా కామెంట్ల వర్షం కురిసింది. మొత్తానికి తప్పును తెలుసుకుందని మరికొందరు ట్వీట్లు చేశారు.












Click it and Unblock the Notifications