ప్యారిస్: తాగుబోతు మహిళా ఉగ్రవాది పేరు హస్నా

ప్యారిస్: ప్యారిస్ లో జరిగిన ఉగ్రదాడి కేసుకు సంబంధించి జరిగిన ఎదురు కాల్పులలో అంతం అయిన మహిళా ఉగ్రవాది మృతదేహాం స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం ఫ్రెంచ్ పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ప్యారిస్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అయిన అబ్దెల్ హమీద్ అబోద్ బంధువు (కజిన్) అయిన మహిళా ఉగ్రవాది ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో తననుతాను బాంబులతో పేల్చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు.

ప్యారిస్ నగర శివార్లలోని సెయింట్ డెనిస్ అపార్ట్ మెంట్ పై పోలీసులు జరిపిన దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది(ఐఎస్ఐఎస్), ప్యారిస్ దాడుల కీలక సూత్రధారి హమీద్ హతమైన ప్రాంతంలోనే మహిళా ఉగ్రవాది శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 A major police operation in Saint-Denis, a suburb of the Paris city

సంఘటనా స్థలంలో వ్యానిటి బ్యాగ్, పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. మహిళా ఉగ్రవాది పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఆమె పూర్తి వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరించారు.

అన్ని లవాట్లు ఉన్నాయి......హస్నా సోదరుడు

మహిళా ఉగ్రవాది సోదరుడిని పోలీసులు విచారించారు. అతను పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. హస్నా ఎప్పుడూ మా కుటుంబ సభ్యుల మాట వినలేదని, పత్రి రోజు పబ్ లకు వెళ్లి పీకలదాక మద్యం సేవిస్తుందని, విపరీతంగా సిగరెట్లు కాల్చుతుందని చెప్పాడని అన్నారు.

అంతే కాకుండ ఆమెకు పలువురితో సహవాసం ఉందని, ఒక్క సారికూడా మా పవిత్ర గ్రంధం ఖురాన్ చదవలేదని, ఆమె కు లేని చెడుఅలవాట్లు లేవని, ఏ రోజు ఓ మహిళగా హస్నా ప్రవర్తించలేదని ఆమె సోదరుడు వివరించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+