సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా పోర్న్ స్టార్!
ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలని పిటిషన్ దాఖలైంది.
న్యూయార్క్: అమెరికాలోని భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితికి
ఆ దేశ రాయబారిగా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చేపట్టిన తొలి మహిళా నియామకం ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాకు ఓ పోర్న్ స్టార్ ను అమెరికా రాయబారిగా నియమించాలంటూ పిటిషన్ దాఖలవడం ప్రస్తుతం అక్కడ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

అమెరికాలో పోర్న్ స్టార్‌గా పేరొందిన మియా ఖలీఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ ఈ పిటిషన్ దాఖలైంది. చేంజ్.ఓఆర్జీ ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌కు మద్దతుగా ఇప్పటికే 1200మంది సంతకాలు చేశారు. మరో మూడు వందల మంది దీనికి మద్దతు పలికితే.. పిటిషన్ ను అధికారిక స్వీకరణకు మార్గం సుగమం అవుతుంది.
సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా జాతీయంగా అంతర్జాతీయంగా ప్రజలందరినీ ఒక్కచోటకు చేరుస్తున్న ఘనత ఖలీఫాకు దక్కుతుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. అమెరికా బహుళకు సంస్కృతికి ఆమె ప్రతీకగా నిలుస్తుందని, మధ్య ప్రాచ్యంలో ఆమె గొప్ప నేతగా నిలుస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా దీన్నో సెటైరికల్ పిటిషనర్ గా పేర్కొంటున్న చాలామంది నెటిజెన్స్ పిటిషన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.












Click it and Unblock the Notifications