ఒక్క బిడ్డను కనడానికి రూ. 33 కోట్లు డిమాండ్ చేసిన భార్య.. భర్త నవ్వుతూ..

సాధారణంగా భార్యభర్తలు పెళ్లయిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నిస్తారు. పిల్లలతో ఆడుకోవాలని..వారిని పెంచి పెద్దచేయాలని కలలు కంటారు. కానీ ఓ మహిళ మాత్రం తన భర్తకు వింత కండిషన్ పెట్టింది. తాను ఫ్రీగా పిల్లల్ని కననని..బిడ్డ కావాలంటే రూ. 33 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మాతృత్వం ఉచితంగా రాదని.. డబ్బు ఇస్తేనే పిల్లల్ని కంటానని షరతులు విధించింది. మరి ఆ భర్త ఏం చేశాడంటే..?

ఈమె పేరు మలైకా రాజా..పుట్టిపెరిగింది బ్రిటన్ లో.. దుబాయ్ కు చెందిన బిలియనీర్ ను పెళ్లాడి ప్రస్తుతం అక్కడే ఉంటోంది. అయితే మలైకాకు తన లైఫ్ స్టైల్, విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ వీడియోస్, రీల్స్ చేయడం అలవాటు. ఇక ఈమెకు ప్రస్తుతం ఒక కూతురు ఉంది. అయితే తాజాగా తన భర్త మలైకాను ఇంకో బిడ్డను కనాలని అడిగాడు. దీనికి ఆమె షాకింగ్ కండిషన్స్ పెట్టింది. మాతృత్వం ఫ్రీగా రాదని.. పిల్లల్ని కనాలంటే రూ. 33 కోట్లు ఇవ్వాలని షరతులు విధించింది. అయితే వీటికి ఆమె భర్త నవ్వుతూ ఒప్పుకున్నాడు. మలైకా.. తనకోసం, తనకు పుట్టబోయే బిడ్డ కోసం రూ. 33 కోట్లతో షాపింగ్ చేసింది.

Malaikah Raza a British-born millionaire s wife in Dubai Demands Rs 33 Crore for One Child

ఆమె కొన్న వస్తువుల వివరాలు..

పింక్ కలర్ జీ- వాగన్ కారు.. తన కూతురితో కలిసి వెళ్లేందుకు..
రూ. 15 కోట్లతో ఇళ్లు.. పిల్లలు పెరిగేందుకు
రూ. 86 లక్షలతో 8 డిజైనర్ బ్యాగులు
రూ. 70 లక్షల విలువైన బంగారం
తన కూతురి కోసం ఖరీదైన వస్త్రాలు
రూ. 70 లక్షలు పుట్టబోయే పిల్లల కేర్ కోసం

ఆమె కొన్న వస్తువులకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమమైన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మలైకా వివాహం 2017లో జరిగింది. తాను విలాసవంతమైన జీవితం కోసమే దుబాయ్ కు చెందిన బిలియనీర్ ను వివాహమాడినట్లు చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+