సుల్తాన్ బంగారు విమానం ఖరీదు ఎంతంటే ?
పెర్త్: ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో దిగిన బంగారపు ప్రయివేట్ విమానాన్ని చూసి స్థానికులు షాక్ కు గురైనారు. ఆ విమానం ఖరీదు ఎంతా అని ఆరా తీశారు. విషయం తెలుసుకుని షాక్ కు గురైనారు.
ఇన్నివందల కోట్లు ఖర్చు పెట్టి మరీ బంగారపు విమానం తయారు చేయించుకున్న వ్యక్తి ఇప్పుడు ఆస్ట్రేలియాలో హాటా టాఫిక్ గా మారారు. మలేషియాలోని జొహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ ఈ బోయింగ్ 737- బంగారపు ప్రయివేట్ విమానం యజమాని.
జోహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ తన భార్య రాజా జారీత్ సోఫియాతో కలిసి ఆస్ట్రేలియాలో సెలవులు గడిపేందుకు బంగారపు విమానంలో పెర్త్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ బంగారపు విమానం వచ్చిందని తెలుసుకున్న పెర్త్ వాసులు దానిని చూడటానికి క్యూకట్టారు.

ఈ బంగారపు విమానం విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ. 668 కోట్లు) ఉంటుందని భావిస్తున్నారు. విమానంలో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. జోహర్ సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానం తయారు చేశారు.
ఈ విమానంలో డైనింగ్ రూం, బెడ్ రూం, మూడు వంట గదులు, షవర్ ఉన్నాయి. ఈ విమానం తయారు చెయ్యడానికి రెండు సంవత్సరాలు పట్టిందని జోహర్ సుల్తాన్ ఓ సందర్బంలో చెప్పారు.
ఈయనకు పెర్త్ నగరంలో 6.5 మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన భవంతి ఉంది. జోహర్ సుల్తాన్ ఆస్తి దాదాపు రూ. 6,680 కోట్లు ఉంది. తాను ఎంతో కష్టపడి ఈ సంపద సంపాధించానని జోహర్ సుల్తాన్ అంటున్నారు.












Click it and Unblock the Notifications