Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముందు పెళ్లి, ఆ తర్వాతే ఐసీస్‌లో చేరేందుకు 14ఏళ్ల బాలిక సన్నధ్ధం

కౌలా లాంపూర్: 14 ఏళ్ల మైనర్ బాలిక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక స్టేట్ టెర్రర్ గ్రూపులో చేరేందుకు సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది. మంగళవారం మలేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దక్షిణ మలేషియాలోని మువర్‌కు చెందిన ఆ బాలిక ఐసీస్‌లో చేరేందుకు కౌలా లాంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కైరో విమానం ఎక్కేందుకు బోర్డింగ్‌లో వేచి ఉండగా స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.

ఇన్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు టాన్ శ్రీ ఖలిద్ అబు బాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మలేషియాకు చెందిన 22 ఏళ్ల యువకుడిని కైరోలో ఆ బాలిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడిందని, అనంతరం వారిద్దరూ కలిసి ఐసీస్‌లో చేరేందుకు సన్నధ్ధమైనట్లు తెలిపారు.

 Malaysian police detain 14-year-old girl trying to join ISIS

తొలుత టర్కీ రాజధాని ఇస్తాంబుల్ చేరుకుని ఆ తర్వాత సిరియా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సిరియాలో ఉంటున్న ఇద్దరు మలేషియన్ మిలిటెంట్లతో ఆ యువతి టచ్‌లో ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ బాలికను సెక్యూరిటీ నేరాలు (ప్రత్యేక చర్యలు) చట్టం 2012 కింద అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం బాలిక పెళ్లాడదామనుకున్న వ్యక్తి కైరోలోని ఆల్ అజహార్ యూనివర్సిటీ విద్యార్ధిగా గుర్తించారు.

తల్లి దండ్రులకు తెలియకుండా బాలిక కైరో వెళ్లేందుకు సిద్ధపడిందని పేర్కొన్నారు. ఆమె తల్లిదండ్రులు వెళ్లేందుకు అంగీకరించకపోతే చనిపోతానని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 2013 నుంచి ఇప్పటి వరకు మలేషియాలో టెర్రరిజంతో సంబంధం ఉండి అరెస్టైన వారి సంఖ్య 68కు చేరింది. ఐసీస్‌లో చేరడానికి ఆ బాలిక ఇంకెవరికైనా సహాయ సహకారాలు అందిస్తుందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+