ఒబామా కుమార్తె మాలియా సిగరేట్ తాగుతుందా ?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ఒబామా పెద్ద కుమార్తె చుట్టతాగుతుందా ? గంజాయి చుట్ట తాగుతుందా ? అంటూ ఆన్ లైన్ లో హాట్ టాపిక్ చర్చ జరుగుతున్నది. అయితే ఒబామా పెద్ద కుమార్తె మలియాకు చెడ్డ పేరు తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె స్నేహితులు మండిపడుతున్నారు.
ఇటీవల హర్వార్డ్ యూనివర్శిటీలో ఉన్నత చదువుల కోసం చేరిన ఒబామా పెద్ద కుమార్తె మలియాకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో మలియా ఏదో సిగరేట్ లాంటిదాన్ని తాగుతున్నట్లు కనిపించింది.
మలియా గంజాయి తాగుతున్నట్లు ఉందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. హార్వార్డ్ యూనివర్సిటీలో చేరకముందు లోల్లాపులూజ అనే మ్యూజిక్ ఫెస్టివల్ లో మలియా పాల్గొందని, ఆ సందర్బంలో ఈ దృశ్యం చోటు చేసుకుందని వెలుగు చూసింది.
ఈ వీడియోను బుధవారం కొందరు ఆన్ లైన్ లో పోస్టు చేశారు. అప్పటి నుంచి మలియాపై పలువురు మాటలతూటాలు పేల్చుతున్నారు. అయితే మలియా స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. కొందరు కావాలని ఆమెను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
మలియా ఏనాడు తాను ఓ దేశాధ్యక్షుడి కుమార్తె అనే భావనతో ఉండదని, సామాన్య జీవితం గడపడానికి ఆమె ఇష్టపడుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఆన్ లైన్ లో ఒబామా పెద్ద కుమార్తె మలియా మీద పెద్ద చర్చ జరుగుతున్నది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications