నవ్వినందుకే!: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. పోలీసులే షాక్

తన భార్య తనను చూసి ఆపకుండా నవ్వుతుందన్న కారణంతో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. దీంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మిగిలిపోయింది.

అమెరికా: తన భార్య తనను చూసి ఆపకుండా నవ్వుతుందన్న కారణంతో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. దీంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మిగిలిపోయింది. అమెరికాలోని అలస్కా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కెన్నెత్ రే మాంజరెస్(39), క్రిస్టీ భార్యభర్తలు. ఇద్దరూ కలిసి అలస్కాలోని క్రూయిజ్ షిప్ లో వివాహారయాత్రకు వెళ్లారు. తొలిరోజు బాగానే గడిచినప్పటికీ.. రెండో రోజు ఏమైందో ఏమో గానీ భార్యపై మాంజరెస్ విరుచుకుపడ్డాడు.

Man allegedly kills wife on Alaska cruise

అత్యంత దారుణంగా ఆమెను హత్య చేశాడు. దీంతో వారు బస చేసిన గది మొత్తం రక్తంతో నిండిపోయింది. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వచ్చి చూసేసరికి.. మాంజరెస్ చేతుల నిండా రక్తపు మరకలు గుర్తించారు. మంగళవారం రోజు ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎందుకు చంపావ్? అని మాంజరెస్‌ను పోలీసులు ప్రశ్నించగా.. 'తను నన్ను చూసి నవ్వుతూనే ఉంది.. అది నాకు నచ్చలేదు.. అందుకే హత్య చేశా" అని సమాధానం చెప్పాడు. దీంతో అతని సమాధానం విని పోలీసులే షాక్ తిన్నారు. అగస్టు 10న మాంజరెస్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+