రియాలిటీ టీవీ నటి ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
లాస్ ఏంజిల్స్: ఓ రియాలిటీ టీవీ స్టార్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన అమెరికాలో జరిగింది. రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని కాలాబాసాస్‌లో ఉన్న తన ఇంట్లో వేడుకలు జరుపుకుంటోంది.
ఈ సమయంలో పందొమ్మిదేళ్ల ఓ యువకుడు కైలీ నటి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. గేటు లోపలి నుంచి అతను లోపలికి వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యే అతను కైలీ జెన్నర్ నివాసం వద్ద దాదాపు పదిసార్లకు పైగా తచ్చాడాడు.

నిందుతునికి పోలీసులు మానసిక సంబంధ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం బెయిల్ పైన విడుదల చేశారు. అయితే అతడి వివరాలు, అతను ఎందుకు సదరు టీవీ స్టార్ భవనం వద్ద ఉన్నాడనే సమాచారం మాత్రం వెల్లడికాలేదు.












Click it and Unblock the Notifications