ఇంట్రెస్టింగ్ : విమానంలో పాడు పని..ఇదేమంటే ట్రంప్ ఇందుకు ఓకే చెప్పాడట
వాషింగ్టన్: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... హూస్టన్ నుంచి అల్బుకర్క్‌కు వెళుతున్న సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ఓ మహిళను లైంగికంగా వేధించాడు బ్రూస్ అలెగ్జాండర్ అనే వ్యక్తి. విమానం ల్యాండ్ అవగానే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

నిద్రలో ఉన్న మహిళ ప్రైవేట్ భాగాలను ముట్టేందుకు ప్రయత్నం
బ్రూస్ అలెగ్జాండర్ ముందు సీటులో ఓ మహిళ కూర్చుని ఉంది. విమానం గాల్లోకి ఎగరగానే మహిళ నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన అలెగ్జాండర్ తన ముందు సీటులో ఉన్న మహిళ ధరించిన టీషర్ట్ లోపలికి చేయి పెట్టి కుడివైపు బ్రెస్ట్‌ను ముట్టుకునేందుకు ప్రయత్నించాడు. గాఢ నిద్రలో ఉన్న మహిళ ఒక్కసారిగా నిద్ర లేచింది. వెంటనే చేయి తీశాడు. ఇది ఏదో పొరపాటున జరిగిందని మహిళ భావించింది. కాసేపటికి మళ్లీ ఇదే పనిచేశాడు అలెగ్జాండర్. ఈ సారి మహిళ అప్రమత్తమై అలెగ్జాండర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత ఆ మహిళ విమానంలోనే మరో సీటుకు మారిపోయింది.

మహిళల అంతర్భాగాలను ముట్టుకోవచ్చని ట్రంప్ చెప్పాడు
అల్‌బుకుర్క్‌లో విమానం ల్యాండ్ అవగానే అలెగ్జాండర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని చేతికి సంకెళ్లు వేసి పోలీసు వాహనాన్ని ఎక్కించారు. ఆ సమయంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలను పోలీసులకు చెప్పాడు అలెగ్జాండర్. మహిళల ప్రైవేట్ భాగాలను తాకొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని ఈ సందర్భంగా పోలీసులకు చెప్పాడు అలెగ్జాండర్. దీంతో షాక్‌కు గురయ్యారు పోలీసులు.

నువ్వు స్టార్ అయితే మహిళలను ఎక్కడైనా తాకొచ్చు : ట్రంప్
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ట్రంప్ గొంతుతో కూడిన ఓ ఆడియో టేపులు బహిర్గతం అయ్యాయి. ఒక వేళ నువ్వు స్టార్ అయితే నువ్వు ఏమి చేసిన అది తప్పుగా అనిపించదని ట్రంప్ చెబుతున్నట్లుగా ఆడియోలో ఉంది. అమ్మాయిల ప్రైవేట్ భాగాల్లో చేయి వేసినా అది తప్పు కాదు..వారిని ముద్దాడిన అది తప్పుకాదు అని ట్రంప్ చెబుతున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఇది ఆ సమయంలో పెద్ద దుమారమే రేపింది.












Click it and Unblock the Notifications