ఒకరికి తెలియకుండా ఒకరితో 20 ఏళ్లు కాపురం, అరెస్ట్

బీజింగ్: ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడిపిస్తున్న ఓ వ్యక్తిని చైనా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఒకరికి తెలియకుండా మరొకరితో అతను ముగ్గురు భార్యలతో ఇరవై ఏళ్ల పాటు కాపురం చేశాడు. ఇంతమంది భార్యలతో.. ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడిపిన 45 ఏళ్ల చెన్‌ను చైనాలోని గువాంగ్ డాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.

తన భర్త చెన్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానం వచ్చిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తీగ లాగారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విశేషాలు వెలుగుచూశాయి. ఫిర్యాదు చేసిన మహిళను చెన్ 1992లో పెళ్లి చేసుకున్నాడు. కానీ రిజిష్టర్ చేయించుకోలేదు.

Man arrested for marring three women

ఆమెకు తెలియకుండా 1994లో మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. వారిద్దరికీ తెలియకుండా 2007లో మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. 2013లో భర్తపై అనుమానం వచ్చిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది.

అక్రమ సంబంధం అయితే భర్తను క్షమించాలని భావించిన ఆమె మరో ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసి విడాకులు కోరింది. దీంతో పోలీసులు చెన్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కేసు విచారణ జరుగుతోంది. చైనాలో బహుభార్యత్వానికి రెండేళ్ల జైలు శిక్ష అమలులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+