విమాన టాయిలెట్లో మహిళపై లైంగిక దాడి, వ్యక్తి అరెస్టు

న్యూఢిల్లీ: జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం హోనోలులు నుంచి కాన్సాయ్ సిటీ తిరిగి వస్తుండగా విమానంలోని లేడీస్ టాయిలెట్‌లో మహిళపై లైంగిక అకృత్యాలకు పాల్పడిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.

వివరాల్లోకి వెళితే హవాయిలోని హిలోకి చెందిన మైకేల్ తనోయ్ (29) అనే ప్రయాణికుడు టాయిలెట్లోకి చొరబడి ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో విమాన సిబ్బంది టాయిలెట్ తరుపు తెరిచేందుకు ప్రయత్నించారు.

ఐతే, తనోయ్ తలుపు లోపలి గడి వేయడంతో తెరుచుకోలేదు. దీంతో, సిబ్బంది స్క్రూలు విప్పదీసి తలుపు తెరిచి, ఆ మహిళను రక్షించారు. వెంటనే విమానాన్ని తిరిగి హోనోలులుకు తీసుకెళ్ళారు. విమానం టేకాప్ ఆయిన 45 నిమిషాల వ్యవధిలోనే ఈ సంఘటన జరిగినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.

Man arrested for sexually assaulting co-passenger in plane toilet

అక్కడ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ విల్సన్ తనోయ్‌ను అరెస్ట్ చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అటు, తనోయ్ తల్లి కూడా అతనితోనే విమానంలో ప్రయాణిస్తోంది. ఘటన అనంతరం ఆమె తన కుమారుడు 'డిప్రెషన్'తో బాధపడుతున్నాడని, చికిత్స పొందుతున్నాడని విమాన సిబ్బందితో చెప్పింది. టాయిలెట్లోంచి వెలుపలికి వచ్చిన తర్వాత అతగాడు తల్లి ఇచ్చిన ఔషధం తాగి వెంటనే నిద్రలోకి జారుకున్నాడట.

ఈ మేరకు ఎఫ్‌బీఐ అధికారులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. బాధిత మహిళ తన తల్లితో కలిసి హవాయ్ దీవుల్లో విహారయాత్ర ముగించుకుని జపాన్‌కు వెళుతోంది. తనోయ్‌పై నేరారోపణలు రుజువైతే తన జీవితాంతం జైలులో గడపాల్సి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+