వీడి అసాధ్యంగూల.. ఎక్స్‌ట్రా లగేజ్ ఛార్జ్ తప్పించుకునేందుకు ఏం చేశాడంటే..

గ్లాస్గో : పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. నిజమే ఒక్కొక్కరి బుర్రలో ఒక్కో రకమైన ఆలోచన వస్తుంటాయి. విమానంలో అదనపు లగేజీ చార్జీలు తప్పించుకునేందుకు మాంచెస్టర్ మహిళ ఒకదానిపై ఒకటిగా ఏడు డ్రెస్సులు వేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చిన ఘటన మర్చిపోక ముందే అలాంటి ఘటనే గ్లాస్గోలో జరిగింది. మాంచెస్టర్ మహిళను స్పూర్తిగా తీసుకున్న ఓ వ్యక్తి ఎక్స్ ట్రా లగేజ్ ఛార్జీలను తప్పించుకునేందుకు అలాంటి పనే చేసి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.

గ్లోస్గోకు చెందిన జాన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఎడిన్‌బర్గ్ బయలుదేరాడు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు చెకిన్ సమయంలో లగేజీ ఎక్కువగా ఉన్నందున ఎక్స్‌ట్రా ఛార్జ్ చెల్లించాలని అధికారులు చెప్పారు. దీంతో జాన్ బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. లగేజీ ఛార్జీలను తప్పించుకోవడం కోసం బ్యాగులోంచి టీ షర్టులు తీసి ఒకదానిపై ఒకటి వేసుకున్నాడు. ఇలా మొత్తం 15 టీషర్టులు వేసుకున్నాడు. ఈ తతంగాన్నంతా ఆయన కొడుకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

man avoids airport charge for over weight luggage by wearing 15 tshirts

జాన్ 15 టీషర్టులు వేసుకున్న తర్వాత అతనిలో అనుమానం మొదలైంది. తన వేషం చూసి ఎయిర్‌పోర్ట్ అధికారులు తనను విమానంలోకి అనుమతిస్తారా లేదా అన్న డౌట్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ అభ్యతరం చెప్పకపోవడంతో ఎడిన్‌బర్గ్ చేరుకుని ఊపిరిపీల్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+