వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వాలిటీ టెస్ట్: ఐఫోన్ బ్యాటరీని కొరికాడు, ముఖంపైనే పేలింది(వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: నాణ్యతను తెలుసుకునేందుకు ఓ యువకుడు ఐఫోన్ బ్యాటరీని నోటితో కొరికాడు. కొరికిన క్షణాల్లోనే ఆ ఫోన్ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. ఈ ఘటన చైనాలోని ఓ స్టోర్‌లో చోటు చేసుకుంది.

ఓ స్టోర్‌లో కొత్త ఐఫోన్ బ్యాటరీ కొన్న వ్యక్తి.. అది అసలుదేనా? కాదా? దాని నాణ్యత ఏ మేరకు ఉందో చూడటానికి దానిని కొరికాడు. దీంతో అది వెంటనే పేలింది. ఒక్కసారిగా బ్యాటరీని అక్కడే పడేసి దూరం పారిపోయారు. కాగా, ఆ వ్యక్తి బ్యాటరీని కొరకడం.. పేలడం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

బ్యాటరీ పేలినా అదృష్టవశాత్తూ ఆ కొరికిన వ్యక్తితోపాటు అక్కడున్న ఎవరూ పెద్దగా గాయపడలేదు. ఈ ఘటన గత శుక్రవారం చోటు చేసుకుంది. ఈ వీడియోను చైనాకు చెందిన మియోపాయ్ షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

కాగా, జనవరి 20న ఈ వీడియో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే 44 లక్షల వ్యూస్ వచ్చాయి. ఫోన్ బ్యాటరీలను చెక్ చేయడానికి నోటితో ఇలా కొరక్కూడదంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. ఐఫోన్లతో జాగ్రత్త అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.

English summary
This is what we learn from the experience of a man in China, who tried to check the authenticity of an iPhone battery by taking a bite out of it. The battery, which is all lithium ion, exploded in his face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X