వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతను భార్య ముక్కు కొరికి తినేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఫోన్ ఎత్తలేదనే కోపంతో అతను తన భార్య ముక్కు కొరికి తినేశాడు. ఈ ఘటన చైనాలోని డెజ్‌హోయు నగరంలో చోటు చేసుకుంది. ఈ నెల 6వ తేదీన కార్యాలయం నుంచి సమయానికి రాకపోవడంతో తన భార్యకు భర్త ఫోన్ చేశాడు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో అతనికి పట్టరాని కోపం వచ్చింది. భార్య పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె ముక్కు కొరికి మింగేశాడు. దానికితోడు తన తలను గోడకేసి కొట్టాడని బాధితురాలు యాంగ్ స్థానిక మీడియాతో చెప్పింది.

Man Bites Off Wife's Nose, Eats it for Not Answering His Calls

కాగా, అతనితో విడిపోయానని, అయినా ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. బాధితురాలి ముక్కుకు తీవ్రమైన గాయమైందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ముక్కు పూర్వరూపం ధరించడానికి కనీసం 3 నెలల కాలం పడుతుందని అంటున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
A man in China reportedly bit off his wife's nose and ate it after she did not answer his calls.The couple, from the city of Dezhou in China, allegedly got into a fight after the woman did not answer her estranged husband's calls after a late shift at work earlier this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X