మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: నెట్‌లో వీడియో హల్‌చల్

సిడ్నీ: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ వ్యక్తికి అక్కడి సుప్రీం కోర్టు జీవితకాల శిక్ష వేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొన్ని రోజుల కిందట చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ సిడ్నీలో సెయింట్ క్లెయిర్ పార్టీ రమ్మని 16 ఏళ్ల బాలికను వాట్సన్ అనే వ్యక్తి ఆహ్వానించాడు.

పార్టీలో ఆ బాలిక మద్యం సేవించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మైనర్ బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లింది. అనంతరం ఇదే అదునుగా భావించిన వాట్సన్, మరొ కొందరు యువకులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. పథకం ప్రకారమే బాలికను ఇంటికి రప్పించి అత్యాచారం చేశారని సుప్రీం కోర్టులో రుజువైంది.

Man 'caught LAUGHING on GoPro camera as he filmed girl being gang-raped at Sydney party'

ఈ కేసులో ముగ్గురితో పాటు ఓ మైనర్ కూడా దోషిగా ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వాట్సన్ ఉన్నాడు. ఎందుకంటే, ఆ దారుణానికి గురైన బాలికతో ఫేస్‌‌బుక్‌లో అతడు ఫ్రెండ్‌గా ఉండటమే. ట్రిస్టాన్ కార్లైల్ వాట్సన్ అనే యువకుడిని ఓ కేసులో భాగంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రేప్‌కు గురై అపస్మారస్థితిలో బాలిక పడి ఉండగా వాట్సన్ తీసిన వీడియో స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా వాట్సన్ అత్యాచారం చేసినట్లు వీడియోలో కనిపించలేదని అతడి తరఫు న్యాయవాది వాదించాడు. బాధితురాలితో మాట్లాడి పూర్తివివరాలు తెలుసుకోవాలంటూ కోర్టుకు వాట్సన్ తరుపు న్యాయవాది విన్నవించారు.

అయితే అత్యాచారానికి గురైన బాలికను వాట్సన్ తీసిన ఫొటోలతో పాటు అతడి ఫొటో కూడా పోలీసులకు లభ్యమైంది. మైనర్ బాలిక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఈ రకంగా వీడియో తీయడాన్ని సుప్రీం కోర్టు జస్టిస్ డేవిడ్ దావిస్ తప్పబట్టారు. శుక్రవారం మరోసారి ఈ కేసు విచారణకు రానుంది. ఇదిలా ఉంటే మైనర్ బాలిక వివరాలు వెల్లడించేందుకు కోర్టు, పోలీసు శాఖ నిరాకరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+