ఊహించని షాక్: అర్థరాత్రి ప్రియురాలి ఇంటికెళ్తే.. మరో మగాడితో!
ఆపై ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసి.. 'మీరు ఇంటికి వచ్చేసరికి మీ ప్రియురాలి పక్కన వేరే వ్యక్తి పడుకుని ఉంటే! మంచివాళ్లకు మంచివాళ్లే దొరుకుతారని భావించాలి.' అంటూ పేర్కొన్నాడు.
టెక్సాస్: ప్రియురాలో, భార్యో.. తనకు తెలియకుండా వేరొకరితో వ్యవహారం నడిపిస్తే.. వీధికెక్కి రచ్చ రచ్చ చేసే మగాళ్లను ఎంతమందిని చూడలేదు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే అతను మాత్రం దీనికి చాలా భిన్నంగా వ్యవహరించాడు. కళ్లెదుటే ప్రియురాలు వేరొకరితో బెడ్ పై ఉన్నా.. ఏమాత్రం కోప్పడకుండా నవ్వుతూ ఫోటో షూట్ మొదలెట్టేశాడు.
ఇంతకీ విషయమేంటంటే.. డస్టోన్ హాలోవే అనే 23ఏళ్ల యువకుడికి తన ప్రియురాలిపై ఎక్కడ లేని అనుమానం మొదలైంది. అర్థరాత్రి పూట చెప్పా పెట్టకుండా ఆమె ఇంటికెళ్లి, బెడ్ రూమ్ లో దూరిపోయాడు. కళ్లెదురుగా కనిపిస్తున్న సీన్ చూసి షాక్ తిన్నాడు. తాగిన మత్తులో మగతగా నిద్రపోతున్న తన ప్రియురాలు, మరో పక్క వేరెవరో వ్యక్తి, అది కూడా బట్టల్లేకుండా!.

ఇంకేముంది తన అనుమానం నిజమే అనుకున్నాడు. అయితే అందరిలా అతను ఆవేశపడలేదు. చిర్రెత్తుకొచ్చి వారిని చితకొట్టేయలేదు. కోపాన్ని అణుచుకుని ఇలాంటి వ్యక్తినా? తాను నమ్మిందని నవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు, సెల్ ఫోన్ తీసి.. స్మైల్ ఇస్తూ మరీ నిద్రలో ఉండగానే వారితో సెల్ఫీలు దిగాడు.
ఆపై ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసి.. 'మీరు ఇంటికి వచ్చేసరికి మీ ప్రియురాలి పక్కన వేరే వ్యక్తి పడుకుని ఉంటే! మంచివాళ్లకు మంచివాళ్లే దొరుకుతారని భావించాలి.' అంటూ పేర్కొన్నాడు. దీంతో అతని పోస్టులకు విపరీతమైన స్పందన వస్తోంది. మీకసలు కోపం రాలేదా? అని కొందరు, ఇలా ఎందుకు చేశారని మరికొందరు.. రకరకాలుగా అతన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా, అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications