హింసించింది, చంపేశా: ఫేస్‌బుక్‌లో ఫోటోలు

మియామి (అమెరికా): ఫేస్ బుక్ కిల్లర్ డెరెక్ మెడినా (33)ను అమెరికా కోర్టు దోషిగా గుర్తించింది. అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. డెరెక్ మెడినా అతని భార్యను హత్య చేసిన కేసులో దోషి అని వెలుగు చూసింది.

మియామికి చెందిన డెరెక్ మెడినా, జెన్నిఫర్ ఆల్ఫోన్స్ (27) దంపతులు. వీరి మద్య మనస్పర్థలు ఉన్నాయి. నిత్యం దంపతులు గొడవపడేవారు. 2013 ఆగస్టు లో తన ఇంట్లోని వంట గదిలో అతని భార్య ఆల్ఫోన్సోను 8 సార్లు తుపాకితో కాల్చి చంపేశాడు.

తరువాత తన భార్య తనను కత్తితో పొడవడానికి ప్రయత్నించిన సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని పోలీసుల ముందు నాటకం ఆడాడు. పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు.

Man convicted of Killing wife and posting photo of body on facebook in US

అయితే డెరెక్ మెడినా పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసులకు లొంగిపోయే ముందు అతడు భార్యను హత్య చేసిన సమయంలో తీసిన ఫోటోలను ఫేస్ బుక్ లో ఫోస్టు చేశాడు.

తన భార్యను ఎంతో ప్రేమతో చూసుకున్నానని, అయితే తనను నిత్యం వేధింపులకు గురి చెయ్యడం వలనే తాను హత్య చేశానని ఫేస్ బుక్ లో ఫోటోలతో పాటు వివరాలు పెట్టాడు. అందుకే చంపేశానని వివరించాడు.

తాను పోలీసులకు లొంగిపోతున్నానని, ఫేస్ బుక్ స్నేహితులను చాల మిస్సవుతున్నానని, ఈ కేసులో తనకు మరణ శిక్షపడే అవకాశం ఉందని, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని డెరెక్ మెడినా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు అతను నేరం చేసినట్లు కోర్టులో రుజువు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+