విమానంలో బీర్ కావాలంటూ వీరంగం: ల్యాండింగ్
న్యూయార్క్: ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ వ్యక్తి తనకు బీరు కావాలంటూ వీరంగం సృష్టించాడు. అంతేగాక, విమానాన్ని కూల్చేస్తానని, మిగితా ప్రయాణికులను చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి ‘ఫ్లైట్ 622' ఫినిక్స్ నుంచి న్యూయార్క్‌కి బయలుదేరింది. ఇంతలోనే జేసన్ బారోలెట్టి(38) అనే వ్యక్తి ఈ సిగరేట్ కాల్చడం మొదలెట్టాడు.
విమాన సిబ్బంది అతడ్ని హెచ్చరించే వరకూ అలాగే కొనసాగించాడు. ఆ తర్వాత బీరు కావాలంటూ హంగామా చేశాడు. ఇందుకు వారు నిరాకరించడంతో.. బీరు ఇస్తారా? లేక విమానాన్ని కూల్చేయాలా? అంటూ బెదిరింపులకు దిగాడు.
మిగితా ప్రయాణికులను చంపేస్తానంటూ కేకలు వేశాడు. దీంతో విమాన సిబ్బంది పైలెట్‌కు సమాచారం అందించడంతో విమానాన్ని కాన్సాస్‌లోని విచీటా విమానాశ్రయంలో దించారు. అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొంత సేపటికి విమానం అక్కడ్నుంచి బయల్దేరింది. కాగా, ఘటనపై ఎఫ్బిఐ విచారణ జరుపుతోంది.