సెక్స్ చేస్తూ చనిపోయాడు.. అసలేం జరిగింది..?

పరుగు పందాల గురించి విన్నాం... ఆటల పోటీలను చూశాం. పాటల పోటీలలో పాల్గొని ఉంటాం. మరి ఎప్పుడైనా శృంగార పోటీలు తిలకించారా... కనీసం ఇలాంటి పోటీ అంటూ ఒకటుందని విన్నారా..? మీరు తప్పుగా చదవలేదు... అవును సెక్స్ కంపిటీషన్ గురించి విన్నారా... నైజీరియాలో ఇలాంటి పోటీనే ఒకటి జరిగింది. అయితే బహిరంగ ప్రదేశంలో ఈ పోటీ జరగలేదు...ప్రైవేట్ ప్లేస్‌లో ఈ కాంపిటిషన్ జరిగింది. అయితే మగ ఆడ మధ్య మాత్రం జరిగే ఈ పోటీ ఏకంగా ఒకరి ప్రాణమే తీసింది.

శృంగార పోటీలో పాల్గొన్న ప్రేమికులు

శృంగార పోటీలో పాల్గొన్న ప్రేమికులు

ఇక అసలు విషయానికొస్తే నైజీరియాలో డేవీ అనే వ్యక్తి, లవెత్ అనే యువతి ఓ పందం కాసారు. శృంగారంలో బెస్ట్ ఎవరనేదే ఈ పోటీ సారాంశం. ఇందుకోసం వేదికగా లగోస్‌లోని ఓ హోటల్ గదిని ఎంచుకున్నారు. అంతకంటే ముందు ఇద్దరు గొడవపడ్డారు. రతిక్రీడలో ఎవరికి వారే గొప్పఅని చెప్పుకున్నారు. గంటల తరబడి ఎవరు ఎక్కువగా రతి క్రీడలో పాల్గొంటారో అనేదానిపై పోటీ పెట్టుకున్నారు. అయితే ఓటమిని ఎవరూ అంగీకరించలేదు.

రతి క్రీడకు వేదికగా నిలిచిన హోటల్ గది

రతి క్రీడకు వేదికగా నిలిచిన హోటల్ గది

ఇక సెక్స్ పోటీలో ఎవరైతే గెలుస్తారో వారికి భారీగా డబ్బు బహుమానం ప్రకటించుకున్నారు. ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. హోటల్ గదికి చేరుకున్నారు. ఇద్దరూ నగ్నంగా పడకపైకి వచ్చారు. ఇక గేమ్ స్టార్ట్ అయ్యింది. బాక్సింగ్ పోటీలో ఎలా అయితే రౌండ్లు ఉంటాయో... అలానే ఒక మారథాన్‌లా ఇద్దరి మధ్య రతీక్రీడ సాగింది. ఆరు రౌండ్లు వరకు డేవీ తన వీరప్రతాపం చూపాడు. అలుపు సొలుపు లేకుండా శృంగారంలో తన సత్తా చూపాడు. లవెత్ కూడా ఏమీ తగ్గలేదు. డేవీ కంటే తనలో సామర్థ్యం ఇంకా ఉందని చాటింది. ఇద్దరూ శృంగారంలో స్వర్గపుటంచుల వరకు వెళ్లారు.

ఏడో రౌండ్లో కుప్పకూలిన డేవీ

ఏడో రౌండ్లో కుప్పకూలిన డేవీ

ఇక ఏడో రౌండు ప్రారంభమైంది. డేవీ మళ్లీ మొదలెట్టాడు. లవెత్ పై పడుకుని మళ్లీ స్వర్గపుటంచుల వరకు ఆమెను తీసుకెళ్లాడు. సరిగ్గా భావప్రాప్తి కలిగే సమయంలో ఒక్కసారిగా డేవీ కుప్పకూలాడు. ఓడిపోయాడని లవెత్ భావించింది. ఇక నీతో కాదులే..పందెం నేనే గెలిచా.. డబ్బులు ఇచ్చేయమని డేవీతో చెప్పింది. కానీ డేవీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. డేవీ...డేవీ అని పిలిచింది. కానీ అతను పలకలేదు. ఏమైంది నీకు అంటూ కుప్పకూలిన డేవీని తనవైపు తిప్పుకుంది. అంతే ఉలుకూ పలుకూ లేని తన లవర్‌ను చూసిన లవెత్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తను ఎంతగానో ప్రేమించిన డేవీ మృతి చెందాడన్న సంగతిని గ్రహించింది.

హోటల్ మేనేజ్‌మెంట్ ఫిర్యాదుతో లవెత్‌ను అరెస్టు చేసిన పోలీసులు

హోటల్ మేనేజ్‌మెంట్ ఫిర్యాదుతో లవెత్‌ను అరెస్టు చేసిన పోలీసులు

వెంటనే హోటల్ మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లింది. డేవీ మృతి చెందాడని తమ మధ్య జరిగిన శృంగార పోటీలో తను మరణించాడని వెల్లడించింది. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని ఆమెను అరెస్టు చేశారు. డేవీ మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపారు. లవెత్‌ను విచారణ చేయగా ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు వెల్లడించింది. అయితే పోస్టుమార్టం రిపోర్టు పైనే లవెత్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+