ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది: ఉద్యోగం కోసం ఈ వ్యక్తి ఏంచేశాడో తెలుసా..?

Recommended Video

    ఒక్క ఐడియా మనోడి జీవితాన్నే మార్చేసింది

    కాలిఫోర్నియా: ఉద్యోగం పురుష లక్షణం అంటారు. మంచి డిగ్రీ చేతిలో ఉండి ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటే పొరిగింటి వారు సంధించే ప్రశ్నలు ఆ ప్రశ్నలకు ఇంట్లో వారు సమాధానం చెప్పలేక మొహం చాటేస్తూ ఉండటం... దాని వల్ల కలిగే వేదన ఎలా ఉంటుందో ఒక్క నిరుద్యోగికి మాత్రమే తెలుసు. కుటుంబంతో కలిసి ఏదైనా ఫంక్షన్‌కు వెళితే మీ అబ్బాయి ఏమి ఉద్యోగం చేస్తున్నారండీ అని బంధువులు అడిగితే కలిగే మనోవేదన వర్ణించలేము. అసలు ఈ ఫంక్షన్‌కు ఎందుకొచ్చాంరా బాబూ అని అనిపిస్తుంది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డేవిడ్ కసారెజ్ ఉద్యోగం కోసం పడిన పాట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

    డేవిడ్ కసారెజ్ వెబ్ డెవలపర్. చిన్న కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఉద్యోగం పోయింది. ఇక అప్పటి నుంచి డేవిడ్ ఉద్యోగ ప్రయత్నం చేశాడు. ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో జీవితం గడపడం భారంగా మారింది. ఉన్న కారును అమ్మేశాడు. దాంతో కొన్ని రోజులు గడిపాడు. ఇక ఆయన నివాసం పార్కుల్లోకి మారింది. రోజు పార్కులోనే ఉంటూ జీవనం సాగించేవాడు. ఒక్క చిన్న ఐడియా డేవిడ్ జీవితాన్నే మార్చేసింది.

    Man displays plycard for want of job amid heavy traffic,look what happened

    ఈ నెల 27న ఉదయం తాను ఉన్న మౌంటెన్ వ్యూలోని పార్క్ బెంచ్ మీద నుంచి లేచి నీట్‌గా రెడీ అయి ఒక ఫ్లకార్డు పట్టుకుని వీధుల్లో నిల్చున్నాడు. ఆ ఐడియానే ఆయన జీవితాన్ని మార్చేసింది. "నాకు ఇళ్లు లేదు..విజయం సాధించేందుకు ఆకలితో ఉన్నాను.. నా రెస్యూమ్‌ను తీసుకోండి... ఉద్యోగం ఇవ్వండి" అంటూ ఫ్లకార్డుపై రాసి రద్దీగా ఉన్న రోడ్లపై ఫ్లకార్డును పట్టుకుని నిలుచున్నాడు. దాదాపు రెండు గంటల పాటు నిల్చున్న డేవిడ్‌కు జాస్మిన్ అనే ఆవిడా ఆయన పాలిట దైవంలా ప్రత్యక్షమైంది. ఒక ఫోటో తీసుకోవచ్చా అని డేవిడ్‌ను అనుమతి కోరి ఆ ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది. అది కాస్త వైరల్‌గా మారడంతో మనోడి పంట పండింది.

    ఉద్యోగం కోసం డేవిడ్ పడుతున్న పాట్లను చాలా సంస్థలు తెలుసుకున్నాయి. అంతే ఆయా సంస్థలు డేవిడ్ నువ్వు మా కంపెనీకి ఇంటర్వ్యూకు రావాలి అంటూ మెయిల్స్, ఫోన్లు చేశాయి. ఒకప్పుడు ఒక్క కంపెనీ నుంచి కూడా ఒక్క కాల్ లేదు... ఇప్పుడు మాత్రం ఏకంపెనీలో చేరాలో తేల్చుకోలేక ఉన్నాడు డేవిడ్. గూగుల్, బిట్ కాయిన్ డాట్ కామ్ లాంటి ప్రముఖ కంపెనీలతో పాటు దాదాపు 200 సంస్థలనుంచి డేవిడ్‌కు ఆఫర్స్ వచ్చాయి. తమ కంపెనీలో చేరాలంటూ క్యూలు కడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇదంతా జరిగినందుకు ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాడు డేవిడ్. తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జాస్మిన్‌కు మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+