భార్య అసలు రూపం చూసి.. జడుసుకుని, విడాకులు..

దుబాయ్ : 'తెల్లనవన్నీ పాలని.. నల్లనివన్నీ నీళ్లని..' కనిపించేవన్నీ నిజం కాదనే అర్థంలో వాడుకునే ఈ నానుడిని ఇప్పుడు మేకప్ బాధితులకు కూడా అన్వయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దుబాయ్ లో చోటు చేసుకున్న ఓ తాజా ఘటన ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ.

పెళ్లికి ముందు భార్యను చూసి.. ఊహల్లో తేలియాడిన ఆ యువకుడు.. పెళ్లయ్యాక భార్య అసలు రూపాన్ని జడుసుకున్నాడు. కారణం.. పెళ్లికి ముందు ఆమె మేకప్ లో కనిపించడమే. మేకప్ లో ఆమె అందాన్ని ముగ్దుడైపోయిన అతగాడు.. తీరా అసలు రూపాన్ని చూసి షాక్ తిన్నాడు. దీంతో సరాసరి విడాకులకే సిద్దమైపోయాడు. కొద్దిరోజుల తర్వాత విడాకులు కూడా మంజూరైపోవడంతో ప్రస్తుతం ఇద్దరు విడిగానే ఉంటున్నారు.

couple

ఎప్పుడూ మేకప్ లోనే ఉండే సదరు భార్యామణి.. ఓరోజు స్విమ్మింగ్ చేయడానికని భర్తతో పాటు వెళ్లింది. తీరా స్విమ్మింగ్ చేశాక.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చిన భార్యను చూసి.. అసలు ఈవిడ నా భార్యేనా? అని నోరెళ్లబెట్టారు భర్తగారు. ఆ తర్వాత ఆమె మేకప్ వెనుక ఉన్న మాయ గురించి తెలుసుకుని.. మోసపోయానని వాపోతున్నాడు.

నకిలీ కనురెప్పలతో సహా పలు రకాల మేకప్ సామాగ్రి వాడితేనే ఆమె తనకు మామూలుగా కనిపించిందని.. స్విమ్మింగ్ అయిపోయాక ఆమె అసలు రంగు చూసి నమ్మలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే విడాకుల తర్వాత తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ సైకాలజిస్టును కలిసి తన బాధను చెప్పుకుంది సదరు భార్యామణి. తన భర్తకు అసలు నిజమేంటో చెబుదామనుకున్నా.. అప్పటికే ఆలస్యమైపోయిందని, విషయం తెలిసిన మరుక్షణమే విడాకులు ఇచ్చేశాడని చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+