డ్యాన్స్ చేసిందని భార్యకు విడాకులు ఇచ్చాడు

ఖతార్: ఇష్టం లేని పనులు చేస్తే భార్య మీద కోపం చేసుకున్న భర్తలను చూశాం. తరువాత వారు సర్దుకు పోయిన సందర్బాలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఒక మహానుభావుడు తన భార్య టీవీ చూస్తు డ్యాన్స్ చేసిందని ఏకంగా విడాకులు ఇచ్చేశాడు.

సౌదీ అరేబియాలో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య వయస్సు 32 సంవత్సరాలు ఉంటుంది. భర్త చెప్పిన ప్రతి మాట ఆమె వింటుంటుంది. అయితే అతడు విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఇంటిలో ఉన్న టీవీలో ఎప్పుడూ భక్తి చానెల్స్, సాంసృతిక కార్యక్రమాలు చూడాలని భార్యకు చెప్పేవాడు.

అదే విధంగా సౌదీ అరేబియాలో జరిగే కార్యక్రమాలు కాకుండ వేరే చానెల్స్ పెట్టరాదని భార్యను హెచ్చరించేవాడు. అయితే ఆమెకు పాటల పిచ్చి ఉంది. భర్త ఇంటిలో లేని సమయంలో అప్పుడప్పుడు మ్యూజిక్ చానెల్స్ చూసేది. ఒక రోజు ఆమెకు ఇష్టం అయిన పాట టీవీలో వచ్చింది.

Man divorces wife for listening to music and dancing in saudi

మనస్సు అపుకోలేక లేచి పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చెయ్యడం మొదలు పెట్టింది. ఆ రోజు ఆమె టైం బాగలేనట్లు ఉంది. ఆమె భర్త త్వరగా ఇంటికి వెళ్లాడు. అంతే భార్య పాటలు వింటూ డ్యాన్స్ చేస్తున్న విషయం చూసి మండిపడ్డాడు. పెళ్లి రోజు నువ్వు ఇచ్చిన మాట తప్పావని విరుచుకుపడ్డాడు.

నా మాట విననప్పుడు నేను నీతో కాపురం చెయ్యనని వెంటనే తలాక్ చెప్పేశాడు. ఆమె కుటుంబ సభ్యులు, అతని కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పినా అతడు మాట వినలేదు. డ్యాన్స్ చేసినందుకు భార్యకు విడాకులు ఇవ్వడంతో ఆమె జీవితం రోడ్డున పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+