కొడుకుకు వచ్చిన లెటర్ చదివి జైలుపాలైన తండ్రి
ఒక్కో దేశంలో చట్టాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో అమలవుతున్న చట్టాలు వాటికి విధిస్తున్న శిక్షల గురించి వింటే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంటా అనిపిస్తుంది. స్పెయిన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కొడుకుకు వచ్చిన ఉత్తరాన్ని చదివినందుకు ఓ తండ్రి జైలు పాలయ్యాడు. కుమారుడి ప్రైవసీని దెబ్బతీశారంటూ రెండేళ్ల శిక్ష విధించారు.
వేరే వారి ఉత్తరాలు చదవడం మన దగ్గర కామన్. కొంతమంది సరదాగా ఆటపట్టించేందుకు ఎదుటివారి లెటర్స్ చదువుతుంటారు. స్పెయిన్‌లో మాత్రం ఇదో పెద్ద నేరం. ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సెవిల్లే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కొడుకుతో కలిసి వేరుగా ఉంటున్నాడు. భార్యభర్తల మధ్య కోర్టు కేసు నడుస్తోంది. అయితే పదేళ్ల ఆ అబ్బాయికి తల్లితరఫు బంధువు ఒకరు లేఖ రాశారు. అందులో బాలుడి తండ్రిపై గృహహింస కేసుకు సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. ఆ అబ్బాయి తండ్రిని విమర్శిస్తూ సదరు మహిళ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అది చదివిన ఆ తండ్రి కోపంతో ఊగిపోయాడు. భార్య తరఫు బంధువులు తనను వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కాడు.

లెటర్‌ను సాక్ష్యంగా చూపిన సదరు వ్యక్తి తనపై తప్పుడు గృహహింస కేసు పెట్టారని కోర్టుకు విన్నవించారు. అయితే ఇక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది. సాక్ష్యంగా సమర్పించిన లెటర్‌ను పరిశీలించిన జడ్జి ఆ లెటర్ ఎవరికి వచ్చిందని ప్రశ్నించాడు. కొడుకుకు వచ్చిన లేఖ అని అతను సమాధానం ఇచ్చాడు. ఇంకేముంది పిల్లాడి ప్రైవసీకి భంగం కలిగించారంటూ బాలుడి తల్లి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అంతే కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications