మత్తులో జుగుప్సగా!: మొసలితో సెక్స్.. కానీ మళ్లీ కనిపించలేదు

కనీసం అతను బ్రతికే ఉన్నాడా? చనిపోయాడా? అన్న వివరాలు కూడా తెలియరాలేదు. గస్తీ బలగాలు సైతం అతని కోసం గాలించగా.. ఎక్కడా ఆచూకీ దొరకలేదు.

సిడ్నీ: మత్తు పదార్థాలు మనిషి ఆలోచనలను ఎంత వికృతంగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ. మద్యంతో పాటు మత్తుపొగ తాగిన ఓ యువకుడు.. ఏకంగా మొసలితో సంపర్కానికి సిద్దపడ్డాడు. వద్దని స్నేహితులెంత వారించినా.. తలకెక్కిన మద్యం అతన్ని నిలువనీయలేదు. కోరి మృత్యువును కొనితెచ్చుకున్న తరహాలో.. మొసలితో ఆ పనికి యత్నించి అడ్రసే లేకుండా పోయాడు.

ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. 26ఏళ్ల ఓ యువకుడు తన ఐదుగురు స్నేహితులు కలిసి ఓ బీచ్ దగ్గర పార్టీ చేసుకున్నాడు. పార్టీలో ఫూటుగా మద్యం సేవించిన అతను.. మద్యంతో పాటు మత్తపొగ తాగాడు. దీంతో పూర్తిగా నియంత్రణ కోల్పోయిన అతను.. మొసలితో సంపర్కం చేయాలనుందని స్నేహితులతో చెప్పాడు.

 Man feared dead after trying to have sex with crocodile

స్నేహితుడి కోరికకు నివ్వెరపోయిన మిగతా మిత్రులు.. అదేం పనంటూ అతన్ని వారించారు. అయినా సరే అతగాడు వినిపించుకోలేదు. సైకో తరహాలో.. పిచ్చి పట్టినవాడిలా పదేపదే అదే మాట చెప్పాడు. వద్దంటున్న వినకుండా బీచ్ వెంట పరిగెత్తి.. అక్కడే ఉన్న ఓ మొసలిని సమీపించాడు. ఆ సమయంలో ఒంటి మీద దుస్తులన్ని తొలగించి దాని వద్దకు వెళ్లాడు. అయితే కాసేపటికే అతన్ని మొసలి నీళ్లలోకి లాక్కుపోవడంతో.. అతని ఆచూకీ గల్లంతయింది.

కనీసం అతను బ్రతికే ఉన్నాడా? చనిపోయాడా? అన్న వివరాలు కూడా తెలియరాలేదు. గస్తీ బలగాలు సైతం అతని కోసం గాలించగా.. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో అతను చనిపోయే ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా, ఆ యువకుడు సేవించిన మత్తు పదార్థాల్లో లైంగిక కోరికలకు ఉత్ప్రేరకంగా పనిచేసే ఐస్ అనే పదార్థం ఉన్నట్లుగా తేలింది. ఇలా మత్తులో తూగుతూ ఓ వికృత చర్యకు పాల్పడి అర్దాంతరంగా బలైపోయాడు.

మరోవైపు ఈ ప్రచారంపై అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇందులో నిజానిజాలెంత అన్నది తెలుసుకునేందుకు అంతర్జాతీయ మీడియా ప్రయత్నిస్తోంది. క్వీన్స్ ల్యాండ్ కు చెందిన ఓ పోలీస్ మాత్రం.. ఇలాంటి ఘటన జరిగినట్లు ఇంతవరకు తమ దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+