భార్యతో ఐ డోంట్ లవ్ యూ.. అన్నందుకు జరిమానా విధించిన కోర్టు
టర్కీ: 'నిన్ను ప్రేమించడం లేదని' తన భార్యకు చెప్పినందుకు ఓ భర్తకు న్యాయస్థానం జరిమానా వేసింది. ఈ సంఘటన టర్కీలో ఇటీవలే జరిగింది. సమాచారం మేరకు... ఓ జంటకు పెళ్లైంది. అనంతరం విడాకులకు సిద్ధమయ్యారు. వారి విడాకుల కేసు నడుస్తోంది.
ఈ సమయంలో భార్య, భర్త.. ఇరువురు కూడా పరిహారం కోసం ఒకరి పైన మరొకరు కేసు వేసుకున్నారు. భర్తను అవమానించినందుకు భార్యనే అతనికి పరిహారం చెల్లించాలని కిందికోర్టు చెప్పింది.

ఇది పైకోర్టుకు వెళ్లింది. అక్కడ వాదనలు జరిగాయి. భార్య అదే పనిగా నిందిస్తుండటంతో.. ఆ భర్త 'ఐ డోంట్ లవ్ యూ' అని ఆమెతో చెప్పాడు. దీంతో ఆ న్యాయస్థానం అతనికి జరిమానా విధించింది. భావోద్వేగ దుర్వినియోగ చట్టం కింద అతనికి ఫైన్ వేసింది.












Click it and Unblock the Notifications