లగ్జరీ హోటల్‌లో డేట్‌కు తీసుకెళ్లి.. బిల్లు చూసి పారిపోయిన యువకుడు!

తనకు తాను ఓ లాయర్‌నంటూ చెప్పుకుంటూ ఒక మహిళను ఇంప్రెస్ చేయాలనుకున్న ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. హాంకాంగ్‌లోని ఒక ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌లో డిన్నర్‌కు తీసుకెళ్లి, దాదాపు రూ.8.9 లక్షల బిల్లు చూసి భయంతో పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎలా మొదలైంది ఈ కథ?
ఓ 23 ఏళ్ల యువకుడు తాను ఒక లాయర్‌ను అని చెప్పి టెలిగ్రామ్‌లో ఒక మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం డేటింగ్‌కు దారి తీసింది. ఇద్దరూ హాంకాంగ్‌లోని సెంట్రల్ జిల్లాలో ఉన్న ఒక ఖరీదైన హోటల్‌లో డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ వారు ఎంతో ఖరీదైన ఆహారం, షాంపైన్‌ను ఆర్డర్ చేశారు.

Man Flees After Rs 8 9 Lakh Bill on Luxury Hotel Date in Hong Kong

డిన్నర్ పూర్తియిన తర్వాత బిల్లును చూసిన యువకుడికి కళ్లు బైర్లు కమ్మాయి. దాదాపు 80,000 హాంకాంగ్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 8.9 లక్షలు) బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడు. ఆ బిల్లులో అత్యధిక భాగం "క్రగ్ క్లోస్ ద'ఆమ్బోనాయ్" అనే ఖరీదైన షాంపైన్ బాటిల్‌దే కావడం గమనార్హం. దాని ధర ఒక్కటే 70,000 హాంకాంగ్ డాలర్లు (సుమారు రూ. 7.79 లక్షలు). అంత భారీ బిల్లు చెల్లించే ధైర్యం లేక ఆ యువకుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. దీంతో ఆ బిల్లు మొత్తం మహిళే చెల్లించాల్సి వచ్చింది.

ఫిర్యాదు.. అరెస్ట్
మొదట ఈ విషయంపై పెద్దగా స్పందించని ఆ మహిళ.. మరుసటి రోజు(ఆగస్టు 29న) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు వాంగ్‌ను త్స్యంగ్ క్వాన్ ఓ ప్రాంతంలో అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ డిస్ట్రిక్ట్ క్రైమ్ యూనిట్ అతడిని విచారిస్తోంది.

ఈ ఘటన హాంకాంగ్లోని విలాసవంతమైన జీవనశైలిని, అలాగే డేటింగ్లో చేసే అతి ప్రదర్శనల వల్ల వచ్చే అనూహ్య పరిణామాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. నివేదికల ప్రకారం, హాంకాంగ్ తన లగ్జరీ భోజన సంస్కృతికి, ఖరీదైన వైన్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఒక రాత్రి డిన్నర్‌కు సులభంగా లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఒక రొమాంటిక్ డేట్ కాస్తా పోలీసు కేసుగా మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+