2,253 పదాలతో "పేరు".. గిన్నీస్ రికార్డు సాధించిన న్యూజిలాండ్ వాసి !!

నేటి కాలంలో రికార్డుల పిచ్చి ఒక ఫ్యాషన్‌లా మారింది. వాటికి తోడు సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరికి పేరు రావాలన్న కోరిక మరింత పెరిగింది. వీడియోలు వైరల్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది అసాధారణమైన పనులు చేస్తున్నారు. ఆ కోవలోనే రికార్డుల కోసం కొంతమంది చేసే ప్రయత్నాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి విచిత్రమైన ప్రయత్నం చేసి ఏకంగా గిన్నీస్ రికార్డు సాధించాడు న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ వాట్‌కిన్స్. సాధారణంగా పేర్లు కొన్ని పదాలతో లేదా కొన్ని అక్షరాలతో ఉంటాయి. కానీ లారెన్స్ వాట్‌కిన్స్ పేరు మాత్రం 2 వేలకు పైగా పదాలతో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

2,253 పదాల పేరుతో ప్రపంచ రికార్డు..

1965లో జన్మించిన లారెన్స్ వాట్‌కిన్స్ తన పేరును పెద్దది చేసుకోవాలని 1990లో నిర్ణయించుకున్నారట. మొదట ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించి, తన పేరును చట్టబద్ధంగా మార్చుకోవడానికి దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. జిల్లా కోర్టు ఆ అనుమతిని ఇచ్చినా, రిజిస్ట్రార్ జనరల్ దాన్ని తిరస్కరించారు. అయితే లారెన్స్ హైకోర్టులో అప్పీల్ చేయగా, న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

man-from-newzealand-creates-guinness-world-record-by-name-with-2-253-words

దీంతో ఆయన తన పేరును మొత్తం 2,253 పదాలుగా పెంచుకున్నారు. ఈ మేరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. లారెన్స్ ప్రస్తుతం ఒక స్థానిక లైబ్రరీలో ఉద్యోగం చేస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ.. గిన్నిస్ బుక్‌లో ఉన్న విచిత్రమైన, విభిన్నమైన రికార్డులు ఎప్పుడూ నాకు ఆకర్షణగా ఉండేవి. నేనూ ఏదో రికార్డు సృష్టించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చివరికి నా పేరుతోనే అది సాధ్యమని గ్రహించానని తెలిపారు. తన పేరును పెద్దదిగా మార్చుకోవడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం రికార్డు కాదని.. తన వ్యక్తిత్వాన్ని వినూత్నంగా వ్యక్తపరచడం అని లారెన్స్ చెబుతున్నారు. పేరు పొడిగించే ప్రక్రియలో తన స్నేహితులు, సహచరులు సహాయం చేశారని ఆయన తెలిపారు. పేరు రాయడం, టైప్ చేయడం, డాక్యుమెంట్ల రూపకల్పన వంటి పనుల్లో చాలామంది సహకరించారని అందరి సహాయంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

అయితే ఇంత పెద్ద పేరును పలకడం అసాధ్యం కావడంతో చాలామంది లారెన్స్‌ను సరదాగా "ఏ టూ జెడ్ 2000" అని పిలుస్తున్నారని స్పష్టం చేశారు. లారెన్స్ తన పేరులో చరిత్ర, సైన్స్, సాహిత్యం, మిథాలజీ, సంగీతం, భూగోళ శాస్త్రం వంటి అనేక రంగాల పదాలు చేర్చారు. అంతే కాకుండా ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, కవులు, దేశాలు, గ్రహాలు, దేవతల పేర్లు ఉన్నాయి. గిన్నిస్ బుక్‌లో తన పేరు చేరిన తర్వాత పలు దేశాల నుంచి మీడియా, పరిశోధకులు సంప్రదించారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+