Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం: కూతురుతో శృంగారం, వ్యక్తికి పద్దెనిమిదేళ్ల ఏళ్ల జైలు శిక్ష

పుత్రజయ: తన 12 ఏళ్ల కూతురుతో శృంగారంలో పాల్గొన్నందుకు ఓ వ్యక్తికి 18 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముగ్గురు జడ్జిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అతనికి శిక్ష విధించింది. ఈ సంఘటన మలేసియాలో జరిగింది.

కూతురుపై ఘాతుకానికి పాల్పడినందుకు గాను అతనికి కోర్టు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఆతను హైకోర్టుకు వెళ్లాడు. అయితే కోర్టు తీర్పు ప్రజా ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని, లైంగిక నేరస్థులకు శిక్షించడం అవసరమని అక్కడి హైకోర్టు పేర్కొంది.

 శిక్ష తగ్గించాలని అప్పీల్

శిక్ష తగ్గించాలని అప్పీల్

నిందితుడి వయస్సు 37 ఏళ్లు. తన కుటుంబానికి అండగా ఉండేందుకు, తన శిక్షను తగ్గించాలని న్యాయస్థానాన్ని నిందితుడు కోరాడు. కానీ న్యాయస్థానం అతని అప్పీల్‌ను తిరస్కరించింది. అతను రెండేళ్ల క్రితం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 18 జూన్ 2016 తేదీన అర్ధరాత్రి సెలాంగోర్‌లోని బాటాంగ్ కాలి‌లో గల బందర్ ఉటమాలోని నివాసంలో ఘోరానికి పాల్పడ్డాడు.

ఫైనల్‌గా నిందితుడికి శిక్ష

ఫైనల్‌గా నిందితుడికి శిక్ష

సెక్షన్ 376(బీ)(1) కింద అతనిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతనికి సెషన్స్ న్యాయస్థానం 17 ఫిబ్రవరి 2017న పదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం హైకోర్టు ఆ శిక్షను పద్దెనిమిదేళ్లకు పెంచింది. ఇలాంటి ఘాతుకాలకు పదేళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య శిక్ష పడుతుంది. నిందితుడికి కొరఢా దెబ్బల శిక్షను కూడా విధించింది.

 జాలి చూపాల్సిన అంశం కాదు

జాలి చూపాల్సిన అంశం కాదు

నిందితుడు అప్పీల్ చేసుకున్నప్పటికీ అది జాలిపడాల్సిన విషయం కాదని న్యాయమూర్తులు తెలిపారు. అందుకే అతని అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కాగా, నిందితుడుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన కుటుంబాన్ని చూసుకునేందుకు శిక్ష తగ్గించాలని విజ్ఞప్తి చేసుకున్నాడు. కానీ కోర్టు తిరస్కరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+