ప్యారిస్ దాడులు: కుట్ర చేసిందే సలా !
ప్యారిస్: ప్యారిస్ నగరంలో ఉగ్రవాదులు దాడులు జరపడానికి కుట్ర పన్నింది ఎవరో తెలిసిపోయింది. బ్రసెల్స్ లో జన్మించిన అబ్దెస్లాం సలా (26) అనే వ్యక్తి అని ప్రాన్స్ పోలీసు అధికారులు అంటున్నారు. అతని ఫోటోను మీడియాకు విడుదల చేశారు.
ఇతను ఎక్కడ కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని, అతనిని ఎవ్వరూ మాట్లాడరాదని పోలీసు అధికారులు సూచించారు. సలాకు ఉగ్రదాడితో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సలాను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

సలా చాల ప్రమాదకరమైన వ్యక్తి అని ఎవ్వరూ అతనికి సహకరించరాదని పోలీసులు మనవి చేశారు. ప్యారిస్ నగరంలో జరిగిన దాడుల కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు బెల్జియంలో ఏడు మందిని అరెస్టు చేశారు.
అరెస్టు అయిన వారిలో సలా సోదరుడు ఉన్నాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్యారిస్ లో ఉగ్రవాదులు దాడి చెయ్యడానికి మొత్తం బెల్జియంలోనే ప్లాన్ వేశారని అధికారులు గుర్తించారని ఫ్రాన్స్ హోం శాఖ మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ చెప్పారు.
ఉగ్రవాదులను గుర్తించడానికి, ఉగ్రవాదులతో లింకులు ఉన్న వారిని పట్టుకోవడానికి బ్రసెల్స్ జిల్లాలోని వివిద ప్రాంతాలలో పోలీసులు సోదాలు చేశారని బెల్జియం ప్రభుత్వ ప్రసార సంస్థ ఆర్ టీబీఎఫ్ వెబ్ సైట్ తెలిపింది.

బ్రసెల్స్ లో నివసిస్తున్న ఇద్దరు ఫ్రెంచి జాతీయులు ప్యారిస్ లో జరిగిన దాడులలో పాల్గోని మరణించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. సలాను వీలైనంత త్వరగా అరెస్టు చేసి మిగిలిన ఉగ్రవాదులను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు.
ప్యారిస్ నగరంలో ఉగ్రవాదులు జరిపిన దాడులలో 129 మంది దుర్మరణం చెందారు. 350 మందికి తీవ్రాయాలైనాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదకులకు అనుకూలంగా ఉన్న వారే దాడులకు ప్లాన్ చేశారని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications