మాంసం పెట్టలేదని భార్యను కొట్టి చంపేశాడు
న్యూయార్క్: తనకు మేక మాంసం కాకుండా శాకాహారం వడ్డించిందనే కోపంతో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు అమెరికాలోని న్యూయార్క్ సిటీ ప్రాసిక్యూటర్స్ చెప్పారు. 75 ఏళ్ల వయస్సు గల పాకిస్తాన్ దేశీయుడు నూర్ హుస్సేన్ 66 ఏళ్ల నాజర్ హుస్సేన్ అనే భార్యను చంపినందుకు విచారణను ఎదుర్కుంటున్నాడు.
తనకు కూరగాయలు వడ్డించినందుకు హుస్సేన్ భార్యపై రెచ్చిపోయాడని ప్రాసిక్యూటర్స్ బుధవారంనాడు చెప్పారు. హుస్సేన్ తన భార్యను కొట్టిన మాట వాస్తవమేనని, అయితే చంపాలనే ఉద్దేశం అతనికి లేదని డిఫెన్స్ అటార్నీ జూలీ క్లార్క్ అన్నారు
పాకిస్తాన్‌లో భార్యను కొట్టడం ఆచారమేనని న్యూయార్క్ పోస్ట్ రాసింది. అతను భార్యను కొట్టడం తప్పు కాదనే సంప్రదాయం నుంచి వచ్చాడని క్లార్క్ అన్నాడు. తన ఆచారం ప్రకారం భార్యను కొట్టడం, భార్యను అదుపులో పెట్టుకోవడం తన హక్కుగా భావించే సంస్కృతి నుంచి అతను వచ్చాడని క్లార్క్ బ్రూక్లిన్ స్టేట్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు చెప్పారు.
చంపాలనే హుస్సేన్ భార్యను కొట్టాడని ప్రాసిక్యూటర్స్ వాదించారు. భార్యను క్రమశిక్షణలో పెట్టే మనిషి కాదని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ షబీహా మాద్నీ అన్నారు. నాజర్ ఏళ్ల తరబడిగా భర్త చేతిలో హింసను అనుభవించిందని అన్నారు.












Click it and Unblock the Notifications