ప్రియురాలిని ‘పోక్’ చేశాడని స్నేహితుడి హత్య

నైట్ ఔట్ నుంచి కారులో వస్తున్న సమయంలో తన స్నేహితుడైన రిచర్డ్ రోవెట్టో(29)ను స్కాట్ హుంప్రే(27) చితకబాదాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా, ఇంతకుముందు కూడా రోవెట్టో తన ప్రియురాలిని పదే పదే ఫేస్‌బుక్‌లో పలకరించాడని నిందితుడు తెలిపాడు. రోవెట్టోను హుంప్రే గట్టిగా కొట్టడంతో అతడు పడిపోయాడని, తల నేలకేసి కొట్టుకుందని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు.
అయితే ఆమెకు హంప్రీతో ఇప్పటికే సంబంధం ఉందన్న విషయం తనకు తెలియదని రావెటో చెప్పాడని తెలిపాడు. అయినా కూడా అతని మాటలు వినకుండా ఆగ్రహంతో అతడిని విచక్షణా రహితంగా కొట్టడంతో రావోట్టో చనిపోయాడని క్యాబ్ డ్రైవర్ తెలిపాడు. కాగా, నిందితుడైన హుంప్రేకు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడింది.












Click it and Unblock the Notifications