భార్యను రేప్ చేసినవాడిని చంపేసి అంగం తినేశాడు
జకర్తా: తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఇండోనిసియాకు చెందిన ఓ వ్యక్తి అత్యంత దారుణంగా పగ తీర్చుకున్నాడు. అతడిని అతి దారుణంగా చంపడమే కాకుండా అతని అంగాన్ని నరికేసి దాన్ని వేయించుకుని తినేశాడు. రోమాంచితమైన ఈ సంఘటన వివరాలను అతను స్వయంగా పోలీసులకు చెప్పాడు.
జకర్తాకు చెందిన ఎఫందీ, నౌరాలది అన్యోన్య దాంపత్యం. అయితే, వారి జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. రౌదీ అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న నౌరాపై అత్యాచారం చేశాడు. ఆమెను అతి కిరాతకంగా రేప్ చేసి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎఫందీ కసితో రగిలిపోయాడు.

అతన్ని పట్టుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచీ అతని కోసం గాలించడం మొదలుపెట్టాడు. గత బుధవారం కారులో వెళ్తున్న రౌదీని అడ్డగించి పెట్రోలు పోసి తగలబెట్టాడు. అంతా అయిపోయిన తర్వాత కూడా అతని శరీరంపై ఇనుప రాడ్‌తో గాయాలు చేశాడు.
ఆ తర్వాత అతని అంగాన్ని కత్తిరించి ఇంటికి తీసుకెళ్లాడు. దానిని వేయించుకుని తినేశాడు. కేసు దర్యాప్తులో ఉండగా తానే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులకు కూడా ఈ నేరం అతనే చేసి ఉంటాడనే అనుమానం రావడంతో వారు ఎఫందీతోపాటు అతని భార్యను నౌరాను కూడా అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.
అయితే ఈ నేరంలో తన భార్యకు ఏమీ సంబంధం లేదని, తన భార్యను వేధించడం ఆపాలని ఎఫందీ వేడుకుంటున్నాడు. ఈ హత్యలో తానొక్కడినే పాల్గొన్నానని, తన భార్య ప్రమేయం ఏమీ లేదని తెలిపాడు.












Click it and Unblock the Notifications