అమెరికాలోని నడి రోడ్డు పైన విమానాన్ని ల్యాండ్ చేశాడు

న్యూయార్క్: సింగిల్ ఇంజిన్ విమానం ఒకటి నడి రోడ్డు పైన ఆగింది! ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్‌లో జరిగింది. ఒకే ఇంజిన్ కలిగిన విమానంలో బ్యాటరీ అయిపోయింది. దీంతో ఆ ప్లేన్‌ను నిర్మాణంలో ఉన్న రోడ్డు పైన ల్యాండ్ చేశారు. వెస్ట్ హార్ట్‌ఫోర్డ్‌లో శనివారం ఈ విమానాన్ని రోడ్డు పైన ల్యాండ్ చేశారని అధికారులు తెలిపారు.

డబ్ల్యూటీఐసీ నివేదిక ప్రకారం.. పైలట్ డాన్ హాల్ విమానాన్ని రోడ్డు పైన నిలిపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. విమానంలో ఇబ్బందులు వచ్చి ల్యాండ్ అయిన రెండు సందర్భాల్లో హాల్ ప్లేన్‌లలో ఉన్నాడు. ఈ విమానం ప్లేన్‌విల్లే నుండి బ్రెయినార్డ్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

Man lands plane on United States road as its battery dies

ఇంజిన్‌లో పవర్ అయిపోవడంతో ఇది జరిగిందని పైలట్ చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. కాగా, రోడ్డు పైన దిగిన ఈ విమానం కుడి రెక్క దెబ్బతిన్నది. నిర్మాణంలో ఉన్న రోడ్డును రెండుగా విభజించే కంచె (ఫెన్స్)ను తాకడంతో అది వంగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+