పామును పెళ్లి చేసుకున్నాడు.. దానితోనే కాపురం చేస్తున్నాడు..

థాయ్ లాండ్ : నమ్మకాలు.. విశ్వాసాలు మనుషులను ఎంతలా భ్రమింపజేస్తాయో చెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ లేదేమో! లేకపోతే.. మనిషి పామును పెళ్లి చేసుకోవడమేంటి? దానితో హనిమూన్ ప్లాన్ చేసుకోవడమేంటి? చనిపోయిన ప్రేయసి పాము రూపంలో జన్మించిందన్న విపరీతమైన విశ్వాసంతో ఏకంగా పామునే పెళ్లి చేసుకున్నాడు థాయ్ లాండ్ కు చెందిన వొర్రానన్ అనే వ్యక్తి.

ప్రస్తుతం పదడుగుల కోబ్రాతో వొర్రానన్ కాపురం చేస్తున్నాడు. ఎక్కడికెళ్లినా.. కోబ్రాను వెంటబెట్టుకునే వెళ్తాడు. కోబ్రాను పక్కనుంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని ఎవరైనా హెచ్చరిస్తే.. ఆ వ్యాఖ్యలను అతగాడు కొట్టిపారేస్తాడు. తన భార్యే పాము రూపంలో పునర్జమ్మ ఎత్తి తనకు దగ్గరైంది అని బలంగా విశ్వసిస్తున్నాడు. ఈమధ్యే పాముతో పాటు సింగపూర్ లో హనీమూన్ కు కూడా వెళ్లొచ్చాడట.

Man marries a 10ft COBRA he believes is his reincarnated girlfriend

పాముతో సహజీవనం వొర్రానన్ కు ఎలా ఉన్నా.. అతన్ని పాముతో చూసినవాళ్లంతా భయంతో దూరం జరుగుతున్నారు. అయినా సరే.. ఐ డోన్ట్ కేర్ అంటున్నాడు వొర్రానన్. సినిమా అయినా.. షికారైనా.. అన్ని పాముతోనే అంటున్నాడు. చచ్చేదాకా పాముతోనే తన బంధం కొనసాగుతుందని తెగేసి చెబుతున్నాడు. ప్రేమలందు వొర్రానన్ ప్రేమ వేరయా! అని చెప్పుకోవాలేమో!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+