టీవీ లైవ్.. రిపోర్టర్‌ని కౌగిలించుకుని అనుచిత వ్యాఖ్యలు... నిందితుడి అరెస్ట్..
ఓ టీవీ చానెల్ రిపోర్టర్ లైవ్‌లో వెదర్ రిపోర్ట్ అందిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను అమాంతం కౌగిలించుకున్నాడు. అంతేకాదు,అసభ్య పదజాలంతో ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆ రిపోర్టర్ షాక్ తిన్నది. అమెరికాలోని యిల్లినాయిస్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. డబ్ల్యూజీఎన్ టీవీకి చెందిన గెనొర్ అనే మహిళా రిపోర్టర్ శనివారం(మే 23) షోర్‌వుడ్ నుంచి లైవ్‌లో వెదర్ రిపోర్ట్ అందించింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఎరిక్ ఫెరినా(20) అనే యువకుడు ఆమె భుజాలను చుట్టేసి కౌగిలించుకున్నాడు. అక్కడితో ఆగక... అసభ్య పదజాలంతో ఆమె పట్ల తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

రిపోర్టర్ గెనొర్ కు మద్దతుగా నిలుస్తూ ఈ ఘటనను చాలామంది నెటిజెన్స్ ఫేస్‌బుక్‌లో తీవ్రంగా ఖండించారు. గెనొర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎరిక్‌ను అరెస్ట్ చేశారు. అతను తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించాడని,తనను భయపెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఎరిక్ నేరం అంగీకరించడంతో 2500 డాలర్ల పూచీకత్తుపై పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.
-
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications