షాక్: డేటింగ్ సైట్ ద్వారా పరిచయమైన 5గురిపై రేప్
డెర్బి: ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లో పరిచయమైన ఐదుగురు మహిళల పైన అత్యాచారం చేసిన ఓ వ్యక్తి ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సంఘటన జరిగింది. ఇది బ్రిటన్‌లోని డెర్బీలో చోటు చేసుకుంది. జాసన్ ప్రముఖ డేటింగ్ వెబ్ సైట్‌లో వేర్వేరు ప్రొఫైల్స్‌తో మహిళలకు వల వేశాడు.
తనతో సంభాషణలు ప్రయివేటు మెయిల్ లేదా ఫోన్ ద్వారా చేయాలని డేటింగ్ సైట్ ద్వారా పరిచయమైన మహిళలకు సూచించేవాడు. అలా తనతో ప్రయివేటు సంభాషణలు జరిపిన తర్వాత వారిని కలుసుకొని వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తన చర్యలు సదరు డేటింగ్ వెబ్ సైట్ దృష్టిలో పడకుండా జాగ్రత్తపడ్డాడు. సదరు సైట్ ద్వారా 2013లో పరిచయమైన మహిళ పైన అతను అత్యాచారం చశాడు. మరో ఘటనలో తనను కలుసుకోవడానికి వచ్చిన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇలా అత్యాచారం చేశాక.. వారికి క్షమించమని సందేశాలు పెడుతుంటాడు. అయిదుగురి పైన అతను ఇలాగే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరో మహిళ పైన సైతం లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. డెర్బీ కోర్టులో అతని ఆకృత్యాలపై విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications