తొలి పురుషాంగ మార్పిడి సక్సెస్ : నెలరోజుల్లోనే శృంగారానికి ఫిట్
బోస్టన్ : అమెరికాలో ఓ క్యాన్సర్ రోగికి పురుషాంగ మార్పిడి చేయడంలో విజయవంతమయ్యారు అక్కడి డాక్టర్లు. చనిపోయిన మరో వ్యక్తి నుంచి పురుషాంగాన్ని సేకరించి, థామస్ మానింగ్ (64) అనే వ్యక్తికి పురుషాంగ మార్పిడి చేశారు. నెల రోజుల్లోనే అంతా మామూలైపోయి, ఆ వ్యక్తి శృంగారానికి కూడా ఫిట్ అవుతాడని ప్రకటించారు.
అమెరికాలోని బోస్టన్ ఆసుపత్రిలో దాదాపుగా 15 గంటల పాటు సర్జరీ నిర్వహించిన డాక్టర్లు పురుషాంగ మార్పిడి చేయడంలో సఫలమయ్యారు. క్యాన్సర్ బారిన పడ్డ థామస్ మానింగ్ కు పురుషాంగాన్ని తొలగించాల్సి రావడంతో, చనిపోయిన మరో వ్యక్తి పురుషాంగాన్ని మానింగ్ కు మార్పిడి చేశారు. మొత్తం 50 కంటే ఎక్కువ మంది డాక్టర్లు ఈ సర్జరీ కోసం శ్రమించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని మసాచుట్స్ జనరల్ హాస్పిటల్ ధ్రువీకరించింది.

సర్జరీ విషయాలను న్యూయార్క్ టైమ్స్ కి వెల్లడించిన డాక్టర్లు, సర్జరీ చేయించుకున్న మానింగ్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం మూత్ర విసర్జనకు ఎలాంటి సమస్య తలెత్తడం లేదని, నెల రోజుల్లో శృంగారంలో పాల్గొనడానికి మానింగ్ ఫిట్ అవుతాడని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచంలో మొట్టమొదటి పురుషాంగ మార్పిడిని 2014 లో దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్ బాస్క్ యూనివర్సిటీలో నిర్వహించారు. సున్తీ సమయంలో పురుషాంగానికి సోకిన ఇన్ ఫెక్షన్ ప్రభావం వల్ల పురుషాంగాన్ని తొలగించిన డాక్టర్లు, తిరిగి మూడేళ్ల తర్వాత మరో పురుషాంగాన్ని ఆ పేషెంటుకు మార్పిడి చేశారు.
అలాగే 2005 లో చైనాలోను ఇదే తరహాలో పురుషాంగ మార్పిడి చేసిన అక్కడి డాక్టర్లు, ఆ తర్వాత అతని విజ్ఞప్తి మేరకు దాన్ని మళ్లీ తొలగించారు.












Click it and Unblock the Notifications