ఘోరం: విమానం నుంచి మనషులను తోసేశారు!
మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విమానం నుంచి కొందరు వ్యక్తులను తోసేశారు. దీంతో ఓ వ్యక్తి ఓ హాస్పిటల్ అంతస్థుపై పడిపోయాడు. మరి కొద్ది దూరంలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
మెక్సికో సిటీ: మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విమానం నుంచి కొందరు వ్యక్తులను తోసేశారు. దీంతో ఓ వ్యక్తి ఓ హాస్పిటల్ అంతస్థుపై పడిపోయాడు. మరి కొద్ది దూరంలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంలచనలంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. మెక్సికో ఉత్తరాన ఉన్న సినాలోవా ప్రాంతంలోని ఐఎంఎస్‌ఎస్ హాస్పిటల్ మిద్దెపై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో హాస్పిటల్‌పై నుంచి ఓ విమానం వెళుతోందని అప్పుడే ఓ వ్యక్తిని కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ దీనిపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేదు.

కులియాకన్ ప్రాంతానికి 60 కిమీల దూరంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని వాటిని కూడా విమానం నుంచే తోసేసుంటారని భావిస్తున్నారు. మృతదేహాలు లభ్యమైన ప్రాంతాల్లో పొలాలు ఎక్కువగా ఉంటాయని ఇక్కడ ఫ్యుమిగేషన్ కోసం విమానాలు తరచూ తిరుగుతూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.
కాగా, కిందపడేసిన వారిని బతికుండగా విమానం నుంచి తోసేశారా? లేక చంపేశాక విసిరేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలతో స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications