ఉంగరంలో వజ్రం చిన్నదైందని.. పెళ్లి చేసుకోనంది!(వీడియో)
బీజింగ్: ఓ యువకుడు తన ప్రేయసికి వజ్రం పొదిగిన ఉంగరం కానుకగా ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఉంగరం తొడిగేందుకు ఆమె వద్దకు వెళ్లాడు. అయితే, ఉంగరంలో ఉన్న వజ్రం చాలా చిన్నదిగా ఉందని ఆమె పెళ్లికి నిరాకరించింది. ఈ వింత ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చైనాకి చెందిన ఓ యువకుడు తన ప్రేయసిని ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అందుకు కొన్ని ఏర్పాట్లు చేసి ఆమెను ఆహ్వానించాడు. యువతి అక్కడికి రాగానే అక్కడి వారందరూ నృత్యం చేస్తూ ఆమెకు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
అనంతరం యువకుడు మోకాలిపై కూర్చుని ప్రేమించిన అమ్మాయి చేతికి వజ్రం పొదిగిన ఉంగరం పెట్టి పెళ్లిప్రతిపాదన చేయబోయాడు. అదంతా చూసి ఆమె తనపై అతనికున్న ప్రేమకు ఎంతో సంతోషించింది. ఇంతలో అబ్బాయి ఉంగరం తీశాడు.
ఉంగరం చూస్తూనే యువతి మొహం మాడ్చుకుంది. ఇంత చిన్న వజ్రం ఉన్న ఉంగరం పెడతావా? నీ ఉంగరం వద్దు! నువ్వూ వద్దు పొమ్మంటూ అక్కడ్నించి అలిగి వెళ్లిపోయింది. ఊహించని పరిణామంతో ఆ యువకుడితో పాటు అక్కడున్నవారందరూ నిశ్చేష్ఠులయ్యారు.
అంతేగాక, ఈ విషయం అంతా ఆ యువతి తన స్నేహితురాలికి మెసేజ్ చేసింది. తన ప్రేమికుడికి తనమీద చాలా ప్రేమ లేదని, పెద్ద డైమండ్ ఉంగరం ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు చిన్న ఉంగరంతో తనను నిరాశపపర్చాడని మెసేజ్‌లో తన ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఈ మెసేజ్‌లు కాస్తా ఆన్‌లైన్‌లో లీక్ అవడంతో ప్రేమజంట వ్యవహారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications